హైదరాబాద్, జూన్ 4: పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జనవరి- మార్చిలో రూ.556.79 కోట్ల ఆదాయంపై రూ.33.32 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1.03 కోట్ల లాభంతో పోలిస్తే 3,134 శాతం పెరుగగా, అదే ఆదాయంలో రూ.451.39 కోట్లతో పోలిస్తే 23 శాతం అధికం.