Paytm Layoffs | పేటీఎంలో ఉద్యోగులకు పింక్ స్లిప్లు.. ఎంత మందికి ఉద్వాసన పలికిందో చెప్పని ఫిన్ టెక్ సంస్థ..!
Paytm Layoffs | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియదు.
Paytm Layoffs | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియదు కానీ, ఉద్యోగులను తొలగించినట్లు పేటీఎం ధృవీకరించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇతర సంస్థల్లో ఉపాధి కల్పనకు సాయ పడుతున్నట్లు పేటీఎం చెబుతున్నట్లు పీటీఐ ఓ వార్తా కథనం ప్రచురించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు కొత్త ఉద్యోగాల కల్పనకు 30 సంస్థలతో కలిసి తమ హెచ్ఆర్ విభాగం పని చేస్తున్నదని పేటీఎం వెల్లడించింది. ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ బోనస్ కూడా విడుదల చేసింది. ఉద్యోగుల తొలగింపు విషయమై తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు పేటీఎం తెలిపింది.
సంస్థ సేల్స్ డివిజన్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3500 మంది తగ్గారు. మార్చి నెలాఖరు నాటికి పేటీఎంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3,6521 మంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సర్వీసులపై ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం నష్టాలు పెరిగాయని తెలుస్తున్నది. నియంత్రణాపరమైన నిబంధనలు పాటించడం లేదని తమ తనిఖీలో తేలడంతో మార్చి 15 తర్వాత కొత్తగా ఖాతాలు ప్రారంభించొద్దని, వాలెట్లు, ఫాస్టాగ్ చెల్లింపులు జరుపొద్దని కస్టమర్లను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిషేధం తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పేటీఎం నష్టాలు రూ.550 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాది 2022-23 నాలుగో త్రైమాసికంలో పేటీఎంకు రూ.167.5 కోట్ల నష్టాలు మాత్రమే వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

