Pan-Aadhar Link | హలో మిమ్మల్నే.. ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం చేసుకున్నారా?.. ఈరోజే లాస్ట్
Pan-Aadhar Link | పాన్-ఆధార్ కార్డుల అనుసంధానానికి శుక్రవారంతో గడువు ముగుస్తున్నది. ఈ అర్థరాత్రి దాటితే, లింక్ చేయని పాన్ కార్డు చెల్లుబాటు కాదని ఆదాయం పన్ను విభాగం తేల్చేసింది.
Pan-Aadhar Link | ఇప్పుడు బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా.. జీవిత బీమా పాలసీ తీసుకోవాలన్నా.. పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) తప్పనిసరి. ప్రతి ఒక్కరూ ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానించ వలిసిందే. ఇప్పటి వరకు పాన్-ఆధార్ అనుసంధాన గడువు పలు దఫాలు పొడిగించింది. శుక్రవారం (జూన్ 30)తో గడువు ముగిసిపోనున్నది. జూలై ఒకటో తేదీ లోగా ఆధార్‌తో అనుసంధానించని పాన్ కార్డులు చెల్లుబాటు కావని ఆదాయం పన్ను విభాగం తేల్చి చెప్పింది.
వాస్తవంగా పాన్-ఆధార్ లింక్ గడువు ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు రూ.1000 ఫైన్ చెల్లించి వాటిని అనుసంధానించాల్సి ఉంటుంది. గత మార్చి 31 వరకు, తర్వాత జూన్ 30 వరకు గడువు పొడిగించింది ఆదాయం పన్ను విభాగం. ఇప్పుడు కూడా మరో చాన్స్ ఇవ్వొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నా.. స్పష్టత రాలేదు. పాన్-ఆధార్ అనుసంధానంతో తమ ఆర్థిక లావాదేవీలు బహిర్గతం అవుతాయన్న భయంతో చాలా మంది వాటిని అనుసంధానించుకోవడానికి ముందుకు రావడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పాన్-ఆధార్ కార్డులను అనుసంధానించామా.. లేదా.. అన్న సందేహాలు ఉంటే వెంటనే ఆదాయం పన్ను వెబ్సైట్లోకి వెళ్లి ‘లింక్ ఆధార్ స్టేటస్’ మీద క్లిక్ చేస్తే వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే లింక్ చేసినట్లు ఉంటే ఆధార్-పాన్ కార్డు అనుసంధానించినట్లు మెసేజ్ వస్తుంది. లేదంటే ఫైన్ చెల్లించి లింక్ చేయడానికి ఆప్షన్లు కనిపిస్తాయి. లింక్ చేసేవారు ఆదాయం పన్ను విభాగం వెబ్ సైట్, ఎన్ఎస్డీఎల్ వైబ్ సైట్ ద్వారా గానీ పే చేయొచ్చు.
ఒకవేళ పాన్-ఆధార్ కార్డులను అనుసంధానించకుంటే బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం, ఆన్ లైన్ పేమెంట్స్, యూపీఐ చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయంపై అధిక మొత్తం పన్ను పే చేయాల్సి ఉంటుంది. పని చేయని పాన్ కార్డుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి నిబంధనలు అనుమతించవు.
MORE READ :
Pan-Aadhar link | దగ్గర పడుతున్న ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం గడువు .. బీ అలర్ట్..!
PAN-Aadhar | ఐటీ శాఖ హెచ్చరిక.. తక్షణం పాన్-ఆధార్ అనుసంధానించండి.. లేదంటే?!
PAN-Aadhar Link | ఆధార్‌తో పాన్ కార్డు లింక్ తప్పనిసరి.. లేదంటే!!
PAN-Aadhaar | ఈ నెలాఖరుతో పాన్-ఆధార్ అనుసంధానానికి లాస్ట్ చాన్స్.. ఎలా లింక్ చేయాలంటే..?!
Pan-Aadhaar Link | నెలాఖరులోగా ఆధార్-పాన్ అనుసంధానించాల్సిందే.. లేదంటే ఈ కష్టాలు తప్పవు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

