Oracle – AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఒరాకిల్ ఫోకస్.. ఏం చేస్తుందంటే..?!
Oracle - AI | ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఒరాకిల్’.. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
Oracle – AI | ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘ఒరాకిల్’.. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒరాకిల్ మై లెర్న్ ద్వారా ఈ శిక్షణ ఇస్తారు. ఒరాకిల్, తమిళనాడు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణ ఇవ్వడానికి ‘నాన్ ముదల్వన్’ కార్యక్రమం కింద ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించాయి.
దేశంలో అత్యధిక యువ జనాభా గల టాప్-12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ నిపుణులు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించుకోవడానికి ఒక వేదికను అందించేందుకు ‘నాన్ ముదల్వన్’ అనే కార్యక్రమం చేపట్టామని తమిళనాడు రాష్ట్ర నైపుణాభివృద్ధి సంస్థ ఎండీ దివ్య చెప్పారు. ఒరాకిల్ సర్టిఫికెట్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ ఎండీ శైలేందర్ కుమార్ చెప్పారు. ఒరాకిల్ సర్టిఫికెట్.. యువత జ్ఞానాన్ని పెంచడంతోపాటు కంపెనీలు కోరుకునే నైపుణ్యాలనూ ధృవీకరిస్తుందన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలతోపాటు స్థిరత్వం పెరుగుతాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ T20I | న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

