Oppo Reno 10 5G | ఒప్పో రెనో10 5జీ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం .. ధరెంతంటే..?!
Oppo Reno 10 5G | ఒప్పో రెనో10 5జీ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. దీని ధర రూ.32,999గా ఖరారు చేసింది.
Oppo Reno 10 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో10 5జీ ప్రీ-బుకింగ్స్ గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్ లైన్ స్టోర్‌లో ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఒప్పో రెనో10 5జీ ఫోన్ రూ.32,999 (ఎక్స్ షోరూమ్) లకు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై బుక్ చేసుకున్న వారికి రూ.3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఒప్పో రెనో10 5జీ ఫోన్ బ్లూ, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఒప్పో రెనో10 5జీ ఫోన్ 6.7-అంగుళాల (1080×2412 పిక్సెల్స్) ఓలెడ్ 3డీ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తున్నది. ఒక్టాకోర్ 6ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13- బేస్డ్ కలర్స్ ఓఎస్ 13పై పని చేస్తుంది.
ఒప్పో రెనో10 5జీ ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.7 లెన్స్ ఆటో ఫోకస్ అండ్ ఓఐఎస్, 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
ఈ నెల 10న ఒప్పో రెనో10 5జీ ఫోన్‌తోపాటు ఒప్పో రెనో10 5జీ, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒప్పో రెనో10 5జీ ప్రో ధర రూ.39,999, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్ ధర రూ.54,999గా నిర్ణయించింది. ఒప్పో రెనో10 ప్రో 5జీ, ఒప్పో రెనో10 ప్రో+ 5జీ ఫోన్లు కూడా ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఆన్ లైన్ స్టోర్, దేశంలోని అన్ని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

