Oppo Find N3 flip | మార్కెట్లోకి ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్.. ధరెంతంటే..?!
Oppo Find N3 Flip | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లోకి తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.94,999గా నిర్ణయించారు.
Oppo Find N3 flip | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 flip) ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తున్న ఈ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5, మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఈ నెల 26 నుంచి ఒప్పో అధికారిక వెబ్సైట్, ఈ-కామర్స్ వెబ్సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ వేదికగా విక్రయాలు ప్రారంభం అవుతాయి. ప్రీ-బుకింగ్స్ ప్రారంభించారు.
12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. ప్రపంచ మార్కెట్లోకి వచ్చిన తొలి ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ఇది. ఈ ఫోన్ ధర రూ.94,999 నుంచి ప్రారంభం అవుతుంది. సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ / డెబిట్ కార్డులతో బుక్ చేసుకున్న వారికి రూ.12 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అదనంగా ఒప్పో ఫోన్ యూజర్లకు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.8,000 రాయితీ కల్పిస్తోంది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 ఫోన్ రూ.99,999లకు లభిస్తుంది.
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ (Oppo Find N3 Flip) ఫోన్ రెక్టాంగులర్ కవర్ డిస్ ప్లే. కవర్ డిస్ ప్లే వైపు రేర్ కెమెరా సెటప్, హాసిల్ బ్లాడ్ బ్రాండింగ్, బ్యాక్ ప్యానెల్ 3డీ కర్వ్ డిజైన్ కలిగి ఉంటుంది. క్రీమ్ గోల్డ్, స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
రెండు ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ ప్లేలతో వస్తుందీ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.8 అంగుళాల ప్రధాన డిస్ ప్లే, 3.26 అంగుళాల కవర్ డిస్ ప్లే ఉంటుంది.
ఫోన్ పనితీరును మెరుగు పరిచేందుకు మీడియాటెక్ డైమెన్సన్ 9200 ప్రాసెసర్ కలిగి ఉంటుంది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. గ్రాఫిక్స్ కోసం మాలీ జీ715 జీపీయూ జత చేశారు.
ఐఓఎస్ ఫీచర్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటది. 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ కెమెరా, 48 మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్, 32 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కోసం 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4300 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. 5జీ, 4జీ, ఎన్ఎఫ్సీ, వై-ఫై, బ్లూటూత్ తదితర ఫీచర్లతో కనెక్టివిటీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

