Oppo A16K : బడ్జెట్ ధరలో మెరుగైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారిని ఒప్పో న్యూ డివైజ్ ఆకట్టుకోనుంది. భారత్ సహా పలు మార్కెట్లలో ఆదరణ పొందిన ఒప్పో ఏ సిరీస్‌కు కొనసాగింపుగా లేటెస్ట్ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఏ16కేను భారత్‌లో కంపెనీ లాంఛ్ చేసింది.
రూ 10,490కి అందుబాటులో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్ డ్రాప్ స్టైల్ డిస్ప్లేతో, ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ35 ఎస్ఓసీతో ముందుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్లలో అమెజాన్, ప్లిఫ్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ వంటి ఈ కామర్స్ వేదికలపై లభిస్తుంది.
ఒప్పో ఏ16కే 5జీ కనెక్షన్‌తో పాటు 2.4డీ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.52 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రియర్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వివిధ లైటింగ్ మోడ్స్‌ను కలిగిఉంది. ఒప్పో ఏ16కే 7.85 ఎంఎం స్లిమ్ డిజైన్‌తో కేవలం 175 గ్రాముల బరువు ఉంది. ఈ స్మార్ట్‌పోన్ 4230ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.