t-hub | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అపోలో టైర్స్‌తో కలిసి ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్ ప్రతినిధి తెలిపారు. వరల్డ్ లీడింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌తో కలిసి సాటర్న్ ఎఫ్1 పేరుతో ఈ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
డిజైన్ థింకింగ్, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్విన్, ఐవోటీ, ఆర్పీఏ, ఏఆర్, వీఆర్ వంటి టెక్నాలజీ స్టార్టప్ కార్యకలాపాలను నిర్వహించే వారిని ప్రోత్సహించడమే లక్ష్యం. వివరాలకు https://bit.ly/4brxj84 సంప్రదించాలి.