స్టార్ హెల్త్ ఐపీవోకు స్పందన కరవు

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు (ఐపీవో) ఇన్వెస్టర్ల నుంచి సరైన స్పందన లభించలేదు. బిడ్డింగ్‌కు చివరిరోజైన గురువారంనాటికి ఈ ఆఫర్ 79 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ప్రసిద్ద ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, అంతర్జాతీయ ఫండ్ వెస్ట్బ్రిడ్స్ క్యాపిటల్ వంటి దిగ్గజాల పెట్టుబడులు కలిగిన స్టార్ హెల్త్ ఐపీవోలో 4.49 కోట్ల షేర్ల ను జారీచేయగా, 3.56 కోట్ల షేర్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చినట్లు స్టాక్ ఎక్సేంజీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెబి నిబంధనల ప్రకారం 75 శాతంలోపు బిడ్స్ వస్తే ఐపీవో విఫలమైనట్లుగా పరిగణిస్తారు. ఆ సందర్భంలో ఆఫర్ క్యాన్సిల్ అవుతుంది. దరఖాస్తు చేసినవారికి డబ్బు తిరిగి చెల్లిస్తారు. అయితే స్టార్ హెల్త్ 79 శాతం సబ్స్క్రిప్షన్లు పొందడం ద్వారా ఆ గండం నుంచి బయటపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ipo
- Star Health
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

