OnePlus Nord CE 4 Lite | వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ఆగయా.. ధరెంతో తెలుసా..?!
OnePlus Nord CE 4 Lite | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ ప్లస్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
OnePlus Nord CE 4 Lite | అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ అంచనాలకు మించి.. అత్యంత తక్కువ ధరకే వచ్చింది. ఫాస్టర్ 80వాట్ల చార్జింగ్ మద్దతు, బ్రైటర్ అమోలెడ్ డిస్ ప్లేతోపాటు మెరుగైన క్వాలిటీ కలిగి ఉంటుందీ ఫోన్.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ ఫోన్లలో మాదిరిగానే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ పని చేస్తుంది. వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి ఫోన్ల విక్రయాలు ప్రారంభం అవుతాయి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) ఫోన్ 1080పీ రిజొల్యూషన్, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 80వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ మద్దతు, 5వాట్ల రివర్స్ చార్జింగ్ (పవర్ బ్యాక్) మద్దతుతో 5,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 మెయిన్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతో వచ్చింది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ (OnePlus Nord CE 4 Lite) ఫోన్ హెడ్ ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లతో వస్తోంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ మెమొరీని పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. సూపర్ సిల్వర్, మెగా బ్లూ, ఆల్ట్రా ఆరెంజ్ రంగుల్లో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి :
Samsung Galaxy S24 Ultra | టైటానియం ఎల్లో కలర్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఆల్ట్రా.. ఇవీ డిటైల్స్..!
SBI | ఈ ఏడాది కొత్తగా 400 శాఖలు ప్రారంభిస్తాం.. తేల్చేసిన ఎస్బీఐ చైర్మన్ ఖరా..!
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్‌పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

