OnePlus Nord CE 3 5G | 4 నుంచి వన్ప్లస్ నార్డ్ సీఈ3 5జీ సేల్స్ ప్రారంభం.. ధరెంతంటే..?!
OnePlus Nord CE 3 5G | వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ సేల్స్ ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. సంస్థ వెబ్ సైట్, అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో లభిస్తాయి.
OnePlus Nord CE 3 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ తన నార్డ్ సిరీస్లో మిడ్ రేంజ్ ఫోన్ ‘వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ సేల్స్ తేదీ ప్రకటించేసింది.ఈ నెల నాలుగో తేదీ నుంచి కంపెనీ వెబ్సైట్తోపాటు ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్లో సేల్స్ ప్రారంభం అవుతాయి.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ ఫోన్ బేస్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.26,999తో ప్రారంభం అవుతుంది. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999 పలుకుతుంది. ఆక్వా సర్చ్, గ్రే షిమ్మర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అర్హత గల బ్యాంకు లావాదేవీలపై రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు.
వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.1 వర్షన్ మీద పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) ఫ్లూయిడ్ అమోలెడ్ స్క్రీన్ విత్ 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్ లేదా 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 782 జీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది.
ఫొటోలు, వీడియో రికార్డింగ్ కోసం వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ కెమెరా విత్ 1/1.56 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ విత్ ఓఐఎస్ అండ్ ఈఐఎస్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇంకా 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా విత్ 112 డిగ్రీ పీల్డ్ ఆఫ్ వ్యూ, 2-మెగా పిక్సెల్ 4సీఎం మాక్రో లెన్స్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ విత్ ఎఫ్/2.4 అపెర్చర్ విత్ ఈఐఎస్ సెన్సర్ ఉంటుంది.
మైక్రోకార్డ్ సాయంతో వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ ఫోన్ స్టోరేజీ ఒక టిగా బైట్ స్టోరేజీ వరకూ పెంచుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. యాక్సెలరోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, టెంపరేచర్ సెన్సర్ తదితర ఫీచర్లు ఉంటన్నాయి. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

