Ola S1 Pro Gen2 | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్.. ఇటీవలే దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ‘ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో జెన్2 (S1 Pro Gen2)` స్కూటర్ల డెలివరీ ప్రారంభించింది. ఓలా ఎస్1 ప్రో జనరేషన్ వన్ స్కూటర్‌కు అత్యాధునిక ఫీచర్లు జోడించిన ఓలా ఎలక్ట్రిక్.. ఓలా జెన్ 2 స్కూటర్’ను మార్కెట్లోకి తెచ్చింది. వందకు పైగా నగరాల్లో ఓలా ఎస్1 ప్రో జెన్2 స్కూటర్ల డెలివరీ ప్రారంభం అయ్యాయని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
ఓలా ఎస్1 ప్రో జెన్2 స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 195 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. కేవలం 2.6 సెకన్లలో 40 కి.మీ వేగం అందుకుంటుందని పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్‌ను తక్కువ బరువు ఉండేలా రూపొందించారు.
ఓలా ఎస్1 ప్రో జెన్ 1 స్కూటర్లో వాడిన మోనోషాక్ యూనిట్‌కు బదులు ఓలా ఎస్1 ప్రో జెన్2 స్కూటర్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ వాడారు. జెట్ బ్లాక్, మ్యాట్ వైట్, స్టెల్లార్, మిడ్ నైట్ బ్లూ, అమెథ్యిస్ట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గత ఆగస్టులో ఆవిష్కరించిన ఈ స్కూటర్ ధర రూ.1.48 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.