Nothing Phone 2 | నథింగ్ ఫోన్ 2పై భారీ తగ్గింపు.. ఇవీ డిటైల్స్
Nothing Phone 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) పై భారీ రాయితీ ప్రకటించింది.
Nothing Phone 2 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ (Nothing) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) పై భారీ రాయితీ ప్రకటించింది. గత జూలైలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) బేస్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999లకే లభిస్తుంది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ (Snapdragon 8 Gen 1 SoC) చిప్సెట్తో వస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.44,999.
ఇక 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.49,999 నుంచి రూ.44,999లకు అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు టాప్ హై ఎండ్ 12 జీబీ ర్యామ్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.54,999 నుంచి రూ.49,999లకే ఆఫర్ చేస్తోంది.
ఇవీ స్పెషిఫికేషన్స్
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ నథింగ్ ఓఎస్ 2.0 వర్షన్‌పై పని చేస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ (1080×2,412 పిక్సెల్స్) ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే విత్ 1-120 హెర్ట్జ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ (Qualcomm’s 4nm Snapdragon 8+ Gen 1 SoC) విత్ అడ్రెనో 730 జీపీయూ కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా విత్ 1/1.56 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), 50-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 45 వాట్ల వైర్డ్ చార్జింగ్, 5వాట్ల క్యూఐ వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4700 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

