‘బ్యాంకులన్నీ అమ్మేయం’

న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు అభయమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించడం లేదని, ప్రైవేటీకరించే బ్యాంకుల్లోని ఉద్యోగులందరి ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కాపాడతామని ఆమె మంగళవారం భరోసా ఇచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తొమ్మిది ప్రధాన యూనియన్లు రెండు రోజుల సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు. ‘పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పాలసీని మేము ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించాం. ప్రభుత్వ సంస్థలు కొనసాగే నాలుగు కీలక రంగాలను గుర్తించాం. వీటిలో ఆర్థిక రంగాన్ని కూడా చేర్చాం. కనుక అన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు భావించడం సరికాదు’ అని ఆమె చెప్పారు.
డీఎఫ్ఐ ఏర్పాటుకు క్యాబినెట్ ఓక
మౌలిక వసతుల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమయ్యే పెట్టుబడులను సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. దీంతో ఇటీవల సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాలుస్తుంది. రూ.20 వేల కోట్ల ప్రారంభ పెట్టుబడితో డీఎఫ్ఐని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ విలేకర్లకు వెల్లడించారు. దీంతో దీర్ఘకాలంలో నిధులను సమీకరించేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థతోపాటు సంస్థాగత విధానాలు ఉంటాయన్నారు. డీఎఫ్ఐకి కొన్ని సెక్యూరిటీలను జారీ చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో డీఎఫ్ఐకి రూ.5 వేల కోట్లు సమకూరుస్తామని, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా కేటాయిస్తామని చెప్పారు. డీఎఫ్ఐలో 50 శాతం మంది నాన్-అఫీషియల్ డైరెక్టర్లు ఉంటారని తెలిపారు. నూటికి నూరు శాతం ప్రభుత్వ యాజమాన్యంతో డీఎఫ్ఐ ప్రారంభమవుతుందని, క్రమేణా దీనిలో ప్రభుత్వ వాటాను 26 శాతానికి తగ్గిస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

