Credit Cards | ప్రీమియం కంటే స్టాండర్డ్కే మొగ్గు..పెరిగిన క్రెడిట్ కార్డుల వాడకం.. ఇవీ కారణాలు!
Credit Cards | 2022 తొలి ఆరు నెలల్లో ప్రీమియం కార్డులతో పోలిస్తే స్టాండర్డ్ క్రెడిట్ కార్డుల వాడకం 67 శాతం పెరిగింది.
Credit Cards | రోజురోజుకు క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోతున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ప్రీమియం క్రెడిట్ కార్డులతో సమానంగా స్టాండర్డ్ క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతున్నది. క్రెడిట్ కార్డు వాడకం దారులు గత ఏడాది సగటున రూ.4,368 ఖర్చు చేస్తే, ఈ ఏడాది అది రూ.7,290కి పెరిగింది. దీన్ని బట్టి స్టాండర్డ్ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ 67 శాతం పెరిగాయి. స్టాండర్డ్ క్రెడిట్ కార్డులతో పోలిస్తే ప్రీమియం క్రెడిట్ కార్డుల వాడకంలో పెద్ద తేడా లేదు. 2021 తొలి ఆరు నెలల్లో ప్రీమియం క్రెడిట్ కార్డుల యజమానులు రూ.7,282 వినియోగిస్తే, ఈ ఏడాది రూ.7,580 మాత్రమే వాడారు.
ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, అపారెల్ అండ్ యాక్సెసరీ స్టోర్లలో 230 శాతం క్రెడిట్ కార్డు వాడకం పెరిగింది. ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ బిల్లుల చెల్లింపులకు క్రెడిట్ వాడకం 140 శాతం పెరిగింది. రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుపైనా ప్రజలు క్రెడిట్ కార్డులు వాడటం ఎక్కువైంది. ఫలితంగా గ్రాసరీ స్టోర్లలో బిల్లుల పేమెంట్స్ కోసం 127 శాతం, వాటర్ లేదా విద్యుత్ లేదా ఫోన్ తదితర యుటిలిటీ బిల్లుల చెల్లింపునకు క్రెడిట్ కార్డు వాడకం 122 శాతం పెరిగింది.
12 టాప్ క్రెడిట్ కార్డుల జారీ సంస్థల్లో ఏడు సంస్థల క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వాడుతున్నారని ఫి సర్వ్ (ఫార్మర్లీ ఫస్ట్ డేటా) పేర్కొంది. ఖర్చులు ఎక్కువైన నేపథ్యంలో క్రెడిట్ కార్డు వాడకం దారులు వస్తువులు, సేవల కొనుగోళ్లకు ప్రజలు క్రెడిట్ కార్డులను సౌకర్యవంతంగా వాడుతున్నారని ఫీ సర్వ్ ఇండియా అండ్ శ్రీలంక కంట్రీ హెడ్ అండ్ ఎండీ రిషీ చబ్రా తెలిపారు.ఈ ఏడాది జూలైలో క్రెడిట్ కార్డుల వాడకం రూ.1.26 లక్షల కోట్ల నుంచి రూ.1.63 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ డేటా తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

