Nokia C32 | భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ నోకియా సీ32.. ధరెంతంటే..?!
Nokia C32 | భారత్ మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా.. నోకియా సీ32 తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.8,999 నుంచి మొదలవుతుంది.
Nokia C32 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘నోకియా’ భారత్ మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ ‘నోకియా సీ32 (Nokia C32)’ తీసుకొచ్చింది. ఇంతకుముందు సెలెక్టెడ్ యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో ఆవిష్కరించింది. నోకియా సీ32 (Nokia C32) ఏడాది రీప్లేస్ మెంట్ గ్యారంటీతో వస్తున్నది. భారత్ మార్కెట్లో రెండు వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.
భారత్ మార్కెట్లో నోకియా సీ32 (Nokia C32) 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.8,999, 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9,499లకు లభ్యం అవుతుంది. నోకియా ఇండియా ఆన్ లైన్ స్టోర్ లో మాత్రమే ఈ పోన్ కొనుగోలు చేయొచ్చు. ఆరు నెలల గడువులో నెలకు రూ.1584 చొప్పున ఈఎంఐ ఆప్షన్ ఉంది. దీనికి నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉపయోగించుకోవచ్చు. బీచ్ పింక్, చార్ కోల్, మింట్ కలర్స్‌లో నోకియా సీ32 (Nokia C32) లభిస్తుంది. ఈ ఫోన్ లో వాడే ప్రాసెసర్
నోకియా కర్వుడ్ 2.5డీ 6.55-అంగుళాల డిస్ ప్లే విత్ 1600 x 700 పిక్సెల్స్ అండ్ యాస్పెక్ట్ రేషియో 20:9తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఔట్ ఆఫ్ బాక్స్ ఓఎస్ వర్షన్ మీద పని చేస్తుంది. రెండేండ్ల సెక్యూరిటీ అప్ డేట్ అందిస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉన్న ఈ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ఏఐ సపోర్టెడ్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్ ఫర్ సెల్ఫీ అందుబాటులో ఉంటది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 10 వాట్ల వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా ఉన్నాయి. ఈ పోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, జీపీఎస్, యూఎస్బీ 2.0, బ్లూటూత్ వీ5.2 కనెక్టివిటీ ఆప్షన్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

