హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం 00.40 గంటలకు హైదరాబాద్ నుంచి డాన్ ముయాంగ్కు బయల్దేరి వెళ్లింది.
వారానికి మూడుసార్లు విమాన సర్వీసులను నడుపుతుండగా..హైదరాబాద్ విమానాశ్రయానికి రాత్రి 23.45 గంటలకు చేరుకుని తిరుగు ప్రయాణంలో 00.45 గంటలకు బయల్దేరనున్నది. ఈ సందర్భంగా జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ.. దేశంలో నోక్ ఎయిర్ సర్వీసులు మొదటగా మా విమానాశ్రయంతోనే ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.