Adani Power- Bangladesh | బంగ్లాదేశ్‌కు ఆల్టిమేటం.. ఏడో తేదీ లోపు బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సప్లయ్ నిలిపేస్తామన్న అదానీ పవర్
Adani Power- Bangladesh | ఈ నెల ఏడో తేదీ లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ ఆల్టిమేటం జారీ చేసింది.
Adani Power- Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ గట్టి షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించక పోవడంతో బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా తగ్గించిన అదానీ పవర్.. బకాయిల చెల్లింపునకు గడువు పెట్టింది. ఈ నెల ఏడో తేదీ లోగా బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపేస్తామని ఆల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం అదానీ పవర్ సంస్థకు బంగ్లాదేశ్ ప్రభుత్వం రూ.7,200 కోట్లు (850 మిలియన్ డాలర్లు) బకాయి ఉంది. ఈ బకాయి చెల్లింపు విషయమై బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు, అదానీ పవర్‌కు మధ్య ఏమైనా సెటిల్మెంట్ జరిగిందా? అన్న విషయమై క్లారిటీ మిస్ అయ్యింది.
బకాయిలు చెల్లించడంతోపాటు సెక్యూరిటీ ఆఫ్ పేమెంట్ కోసం సుమారు రూ.1500 కోట్ల (170 మిలియన్ డాలర్లు)కు అక్టోబర్ 31 లోగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అందజేయాలని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డుకు అదానీ పవర్ డెడ్ లైన్ పెట్టింది. కృషి బ్యాంకు ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. కానీ ఇది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో భాగం కాదని బీపీడీబీ వర్గాలు తెలిపాయి. డాలర్ల కొరత వల్ల విద్యుత్ బకాయిలు చెల్లించక పోవడానికి మరో కారణం అని ఆ వర్గాల కథనం. ఫలితంగా అక్టోబర్ 31 నుంచి జార్ఖండ్ లోని గొడ్డా పవర్ ప్లాంట్ నుంచి 1496 మెగావాట్ల విద్యుత్ బదులు 724 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసింది.
ఇటీవల రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న బంగ్లాదేశ్ లో ఆర్థిక సమస్యలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. గత నెలలో సుమారు 90 మిలియన్ల డాలర్ల విద్యుత్ బిల్లుల బకాయిలను అదానీ పవర్ కు బీపీడీబీ చెల్లించినట్లు సమాచారం. నెలవారీ 90-100 మిలియన్ డాలర్ల విద్యుత్ బిల్లులకు కేవలం 20-50 మిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తూ రావడం వల్లే బకాయిలు పెరిగిపోయాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో బంగ్లాదేశ్ పవర్ సంస్థలు పవర్ పర్చేజింగ్ తగ్గించుకుంటున్నాయి. ఎన్టీపీసీతోకూడిన జాయింట్ వెంచర్ బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్ షిప్ పవర్ కంపెనీ సైతం బొగ్గు కొరత వల్ల సగానికంటే తక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. అదానీ పవర్ తయారు చేసే విద్యుత్ మీద యూనిట్ కు రూ.10-12 పలుకుతుంది. ఇండోనేషియా, ఆస్ట్రేలియాల నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గుతో తయారు చేస్తున్న విద్యుత్ చార్జీలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

