Flight Journey with Full Capacity | 18 నుంచి పూర్తి కెపాసిటీతో ఫ్లైట్ జర్నీ
Flight Journey with Full Capacity | ఈ నెల 18 నుంచి దేశీయ సర్వీసులు పూర్తి కెపాసిటీతో నడుస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది.

Flight Journey with Full Capacity | ఈ నెల 18 నుంచి.. అంటే వచ్చేవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో నడువనున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా.. వాటి కెపాసిటీని బట్టి పూర్తిస్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్తాయని పౌర విమానయానశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల వరకు ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయి. అయితే, కోవిడ్ ప్రొటోకాల్స్, ఇతర ఆంక్షలు కొనసాగుతాయి.
కనీస, గరిష్ట ప్రయాణ చార్జీలపై పరిమితులు యధావిధిగా కొనసాగుతాయి. రెండు గంటల్లోపు సాగే విమాన సర్వీసుల్లో భోజనం వడ్డించరు. కరోనా ఆంక్షల నేపథ్యంలో క్యాటరింగ్ సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని విమానాల్లో భోజన వసతుల కల్పనకు అనుమతించాలని దేశంలోకెల్లా అతిపెద్ద క్యాటరర్, టాటా సన్స్ అనుబంధ తాజ్ శాట్స్.. కేంద్రాన్ని కోరింది.
తాజ్ శాట్స్ సీఈవో మనీశ్ గుప్తా ఇటీవల స్పందిస్తూ.. హోం, సంస్థాగత ఫుడ్ డెలివరీలో విభిన్న సేవలు అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఫ్లైట్ క్యాటరింగ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. 60 శాతం ప్రీ-కరోనా స్థాయికి పెరిగింది. గతేడాది ఇది కేవలం 21 శాతమే. కరోనా నేపథ్యంలో 2020 మార్చి నుంచి దేశీయ విమాన యాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

