హోండా కార్స్ ఇండియా మెగా కార్నివాల్‌ను జెండా ఊపి ప్రారంభించిన కంపెనీ నేషనల్ హెడ్ నిఖిల్ సరిన్.
హైదరాబాద్, మే 12: కొత్త గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందం ప్రకారం టాస్క్‌తో రిజిస్ట్రర్ అయిన 700కి పైగా సంస్థలో ప్రతిభావంతలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంపై టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, హెచ్డీఎఫ్సీ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు.