Alibaba | ఆలీబాబా రివర్స్ గేర్.. లైంగిక వేధింపుల బాధితురాలికి ఉద్వాసన!
Alibaba | సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన మహిళకు చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఉద్వాసన పలికింది.

Alibaba | చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబా ఓ మహిళా ఉద్యోగి, ఆమెకు మద్దతుగా వ్యవహరించిన పది మంది ఇతర ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సదరు మహిళా ఉద్యోగి తనను సహ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపించారు. కానీ నవంబర్ నెలాఖరులో తనను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంటూ ఆలీబాబా యాజమాన్యం తనకు నోటీస్ అందించిందని చెప్పారు. ఈ ఘటనపై చైనా ప్రభుత్వం మద్దతుతో పని చేస్తున్న దాహే డైలీ శనివారం పొద్దుపోయిన తర్వాత వార్తా కథనం ప్రచురించింది.
ఆమె తనపై సహోద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డా.. యాజమాన్యం సరిగ్గా స్పందించలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆలీబాబా టర్మినేషన్ లెటర్లో పేర్కొంది. ఇది సామాజిక పరమైన సమస్య కావడంతోపాటు కంపెనీకి చెడ్డ పేరు వస్తుందని, అందువల్లే తొలగించామని వెల్లడించింది.
ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మరో పది మందిని కూడా ఆలీబాబా ఇంటికి సాగనంపింది. కానీ తానే తప్పు చేయలేదని ఆ మహిళ వాదిస్తున్నారు. తన హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. దీనిపై స్పందించేందుకు ఆలీబాబా అధికార ప్రతినిధి నిరాకరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Alibaba
- e-commerce
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

