Volkswagen | మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ విర్టస్.. టైగూన్ న్యూ వేరియంట్స్.. స్పెషల్ ఎడిషన్స్ ఇవీ డిటైల్స్..
Volkswagen | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ తన విర్టస్ టైగూన్ మోడల్ కార్లలో స్పెషల్ ఎడిషన్, న్యూ వేరియంట్లు భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Volkswagen | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్.. భారత్ మార్కెట్లోకి విర్టస్ (Virtus), టైగూన్ (Taigun) న్యూ వేరియంట్లు, జీటీ ఎడ్జ్ లిమిటెడ్ కలెక్షన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ (GT Edge Limited Collection) కార్లను ఆవిష్కరించింది. కొత్త మోడల్ కార్లలో న్యూ విర్టస్ జీటీ ప్లస్ మాన్యువల్ (Virtus GT Plus Manual), టైగూన్ జీటీ డీఎస్జీ (Taigun GT DSG), టైగూన్ జీటీ ప్లస్ మాన్యువల్ (Taigun GT Plus Manual) కార్లు ఉన్నాయి. ఇవి డీప్ బ్లాక్ పెరల్, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్టె ఫినిష్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఇంతకుముందు 1.5 టీఎస్ఐ ఈవీఓ ఇంజిన్‌పై 7-స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్ మిషన్ విర్టస్ (Virtus) మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ తీసుకొచ్చింది. జీటీ ప్లస్ ట్రిమ్ వర్షన్లో ఇది లభిస్తుంది.
టైగూన్ (Taigun) మోడల్ కారులో రెండు వేరియంట్లు టైగూన్ జీటీ డీఎస్జీ (Taigun GT DSG), టైగూన్ జీటీ ప్లస్ మాన్యువల్ (Taigun GT Plus manual) మార్కెట్లోకి తెచ్చింది. దీంతో తొమ్మిది ట్రిమ్స్, వేరియంట్లలో టైగూన్ (Taigun) మోడల్ కారు అందుబాటులోకి వచ్చినట్లయింది.

న్యూ వేరియంట్స్- స్పెషల్ ఎడిషన్ కార్ల ధరలు
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ డీఎస్జీ – రూ.16.79 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ ఎంటీ – రూ.17.79 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ విర్టస్ జీటీ ప్లస్ (ఎంటీ) – రూ.16.89 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ ఎంటీ డీప్ బ్లాక్ పెరల్ – రూ.17.99 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ ఎంటీ కార్బన్ స్టీల్ గ్రే మాట్టే – రూ.18.19 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ డీఎస్జీ డీప్ బ్లాక్ పెరల్ – రూ. 19.25 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ ప్లస్ డీఎస్జీ కార్బన్ స్టీల్ గ్రే మాట్టే – రూ.19.45 లక్షలు.
ఫోక్స్ వ్యాగన్ విర్టస్ జీటీ ప్లస్ ఎంటీ డీప్ బ్లాక్ పెరల్ – రూ. 17.09 లక్షలు
ఫోక్స్ వ్యాగన్ విర్టస్ జీటీ ప్లస్ డీఎస్జీ డీప్ బ్లాక్ పెరల్ -రూ.18.76 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

