US Green Card | ఇండియన్స్‌కు గుడ్ న్యూస్ అమెరికాలో ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డ్..
US Green Card | వరుసగా 7 ఏళ్లు హెచ్-1బీ వీసాపై పనిచేస్తే గ్రీన్‌కార్డు జారీకి చట్ట సవరణ బిల్లు సెనెట్‌లో ప్రవేశ పెట్టారు.
US Green Card | భారతీయ టెక్కీలకు బైడెన్ సర్కార్ గుడ్ న్యూస్ అందిస్తోంది. మీరు.. అమెరికాలో ఏడేండ్లకు పైగా జీవిస్తున్నారా.. హెచ్-1 బీ వీసాపై ఐటీ సంస్థలో పని చేస్తున్నారా.. అయితే గ్రీన్ కార్డ్.. అమెరికా సిటిజన్‌షిప్ పొందొచ్చు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ( US Immigration Act ) లో సవరణలు చేర్చారు. కొన్ని క్యాటగిరీల్లో పని చేస్తున్న భారతీయ టెక్ నిపుణులకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు సవరిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం అమెరికాలో వరుసగా ఏడేండ్లు పని చేస్తే గ్రీన్ కార్డు పొందడానికి అర్హత సాధించినట్లే.
ఈ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదించగా, ఇతర సెనెటర్లు ఎలిజబెత్ వారెన్, బెన్‌రాయ్ లుజాన్, డిక్ దుర్బిన్ మద్దతు పలికారు. అమెరికా ప్రజా ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఉమన్ జో లాఫ్గ్రెన్. జో లాఫ్గ్రెన్ ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ హౌస్ సబ్ కమిటీ చైర్‌గానూ వ్యవహరిస్తున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారితే ప్రస్తుతం హెచ్-1బీ వీసాపై పని చేస్తున్న వారితో సహా 80 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో హెచ్-1బీ వీసా దారులు, దీర్ఘకాలం వీసాపై పని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమర్లు, తదితరులకు గ్రీన్ కార్డు లభిస్తుంది.. అంటే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దేశాల వారీగా కోటా ప్రకారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న భారతీయ నిపుణులు అత్యధికంగా లబ్ధి పొందుతారని భావిస్తున్నారు.
ఇమ్మిగ్రేషన్ చట్ట సవరణ బిల్లును సెనెటర్ అలెక్స్ పాడిల్లా ప్రతిపాదిస్తూ.. `అమెరికా ఎకానమీకి వెన్నెముకగా ఉంటూ ఏండ్ల తరబడి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వారి ఆశలు సాకారం చేసేలా మన అప్డేటెడ్ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ చర్యలు తీసుకుంటుంది. నేను ప్రతిపాదించిన బిల్లుతో 35 ఏండ్లకు పైగా అమెరికాలో నివాసం ఉంటూ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలిసారి ఇమిగ్రేషన్ రిజిస్ట్రీ.. కటాఫ్ డేట్ అప్డేట్ చేస్తుంది. దశాబ్దాల తరబడి అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన వారి, జీవిస్తున్న వారి, పని చేస్తున్నలక్షల మంది ఇమ్మిగ్రెంట్లపై ఈ బిల్లు ప్రభావం చూపుతుంది` అని అన్నారు.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లు చట్టంగా మారడానికి కొంత సమయం ఉన్నది. తొలుత యూఎస్ సెనెట్, ప్రజాప్రతినిధుల సభ అంగీకరించి, ఆమోదించాలి. అటుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

