Bajaj New Pulsar P150 | స్పోర్టీ లుక్‌తో బజాజ్ న్యూ పల్సర్ పీ150.. రూ.1.17 లక్షలకే లభ్యం!
Bajaj New Pulsar P150 | ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్.. మార్కెట్లోకి స్పోర్టీ లుక్‌తో న్యూ పల్సర్ పీ150 తీసుకొచ్చింది.
Bajaj New Pulsar P150 | ప్రముఖ టూ వీలర్స్ కంపెనీ బజాజ్ ఆటో మార్కెట్లోకి స్పోర్టీ లుక్‌తో న్యూ డిజైన్‌తో న్యూ పల్సర్ పీ150 బైక్ తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ రూ.1.17 లక్షలు, ట్విన్-డిస్క్ వేరియంట్ రూ.1.20 లక్షలు పలుకుతుంది. బజాజ్ ఆటో న్యూ ప్లాట్‌ఫామ్‌పై ఎఫ్250, ఎన్160 తర్వాత మార్కెట్లోకి తీసుకొస్తున్న మూడో పల్సర్ బైక్. కోల్‌కతాలో దీన్ని మార్కెట్లో ఆవిష్కరించారు. త్వరలో దేశంలోని ఇతర నగరాల్లో ప్రవేశ పెట్టనున్నది.
పూర్తిగా స్పోర్టీ లుక్‌తో వస్తున్న `పీ150` పల్సన్ 3డీ ఫ్రంట్, డ్యూయల్ కలర్స్‌తో వస్తుంది. సింగిల్ డిస్క్ వేరియంట్ అప్రైట్ స్టాన్స్, ట్విన్ డిస్క్ పల్సర్ స్ప్లిట్ సీట్తోపాటు స్పోర్టీ స్టాన్స్‌తో అందుబాటులో ఉంటుంది.
149.68 సీసీ ఇంజిన్‌తో పల్సర్ 150సీసీ వస్తున్నది. 14.5 పీఎస్, 13.5 టార్చిని వెలువరిస్తుంది. లీటర్ పెట్రోల్‌పై 50 కి.మీ. మైలేజీనిస్తుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాప్, ఎల్ఈడీ టెయిల్ లాంప్తోపాటు యూఎస్బీ కనెక్టివిటీ ఫీచర్‌తో వస్తుంది. మొబైల్ ఫోన్‌తోపాటు ఇతర గాడ్జెట్లను చార్జి చేసుకోవచ్చు. సింగిల్ చానెల్ ఏబీఎస్ ఫీచర్ లభ్యం అవుతుంది. గేర్ ఇండికేటర్, డిస్టెన్స్ టూ ఎమ్టీ మీటర్ అండ్ క్లాక్ వంటి ఫీచర్లు వస్తున్నాయి.
ఇంతకుముందుతో మోడల్ పల్సర్ బైక్‌లతో పోలిస్తే పీ-150 బైక్ 10 కిలోల బరువు ఎక్కువ ఉంటుంది. 790 ఎంఎం సీట్ హైట్, మోనోషాక్ సస్పెన్షన్ జత చేశారు. ఐదు విభిన్న రంగుల్లో వస్తోంది. రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ రంగుల్లో యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

