యాపిల్ నుంచి కొత్త ఉత్పత్తులు

పర్పుల్ కలర్లో ఐఫోన్ 12 సిరీస్ హ్యాండ్సెట్లు.. ఐమ్యాక్ కనీస ధర రూ.1,19,900
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ ఈ ఏడాది తన తొలి ఈవెంట్‌ను మంగళవారం అమెరికాలో నిర్వహించింది. ‘స్ప్రింగ్ ఈవెంట్-2021’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. వీటిలో ఐప్యాడ్ ప్రో ట్యాబ్లెట్లు, యాపిల్ టీవీ 4కే, సిరి రిమోట్, ఎయిర్‌ట్యాగ్ లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా యాపిల్ ఉత్పత్తుల్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ఐఫోన్ 12 (రూ.79,900), ఐఫోన్ 12 మినీ (రూ.69,900) హ్యాండ్సెట్లను పర్పుల్ కలర్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి ఈ నెల 23 నుంచి బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయని, ఏప్రిల్ 30 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఇవి భారత్‌లో అందుబాటులో ఉంటాయో లేదో వెల్లడించలేదు. మరోవైపు ఎం-1 చిప్‌తో పనిచేసే సరికొత్త ఐమ్యాక్ డెస్క్‌టాప్ కంప్యూటర్ను కూడా ఆవిష్కరించింది. మూడు రకాల స్టోరేజీ ఆప్షన్లలో లభ్యమయ్యే ఈ డెస్క్‌టాప్ బేస్ వేరియంట్ ధరను రూ.1,19,900గా నిర్ణయించింది. 24 అంగుళాల 4.5కే రెటీనా డిస్ప్లేతో కూడిన కొత్త ఐమ్యాక్‌లో 7-కోర్ జీపీయూ, 1080పీ ఫేస్‌టైమ్ హెచ్డీ కెమేరా, స్టూడియో క్వాలిటీ మైక్స్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, టచ్ ఐడీ లాంటి ప్రత్యేక ఫీచర్లున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

