Maruti Wagon R | న్యూ అవతార్‌లో మారుతి వ్యాగన్ఆర్.. ఆ 2 కార్లకు సవాల్!
Maruti Wagon R | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విపణిలోకి న్యూవ్యాగన్ఆర్-2022 ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది.
Maruti Wagon R | దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతిసుజుకి.. వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ కారును విపణిలో ఆవిష్కరించింది. ఇది అన్ని రకాల న్యూ అవతార్ అని పేర్కొంది. ఈ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్.. టాటా టియాగో, హ్యుండాయ్ శాంట్రోలతో పోటీ పడనున్నది. న్యూ అవతార్ వ్యాగన్ ఆర్.. అడ్వాన్స్ డ్ కే-సిరీస్ డ్యూయల్ జెట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, డ్యూయల్ వీవీటి ఇంజిన్ సాయంతో పనిచేస్తుంది. రెండు ఆప్షన్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 1.0 ఎల్, 1.2 ఎల్ పవర్ ట్రైన్ ఆప్షన్లలో వచ్చే న్యూ వ్యాగన్ఆర్ 1.01 ఎల్ ఇంజిన్ వేరియంట్ రూ.5.39 లక్షల నుంచి రూ.7.10 లక్షల మధ్య ధర పలుకుతుంది.
ఈ కారు ఐడియల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. న్యూ డ్యూయల్ జెట్ ఇంజన్ 25.19 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. త్వరలో ఈ మోడల్ సీఎన్జీ వెర్షన్లోనూ ఆవిష్కరించనున్నది. ఇక మారుతి వ్యాగన్ఆర్ 2022 ఫేస్‌లిఫ్ట్ గతానికంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెక్యూరిటీ అలారం, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, బజర్‌తో సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్‌తో పాటు డ్యూయల్-టోన్ గ్రే మెలాంజ్ ఫ్యాబ్రిక్‌తో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్‌తో న్యూ వ్యాగన్ ఆర్ కారు వస్తుంది. నాలుగు స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్,ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ తదితర ఫీచర్లు కూడా లభిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

