Hyundai Alcazar facelift | 6/7 సీటర్ ఎస్‌యూవీల్లో పోటీ.. సెప్టెంబర్‌లో హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్..!
Hyundai Alcazar facelift | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ అనుబంధ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. వచ్చే సెప్టెంబర్ లో అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది.
Hyundai Alcazar facelift | ప్రస్తుతం దేశీయ కార్ల మార్కెట్లో ఎస్యూవీ కార్లదే హవా.. అందునా మూడు వరుసల 6/7 సీట్ల ఎస్యూవీ కార్ల వైపు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపుతున్నారు. మహీంద్రా ఎక్స్ యూవీ 700, మహీంద్రా స్కార్పియో ఎన్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి మోడల్ కార్లకు ఆదరణ బాగానే ఉంది. త్వరలో ఐపీఓకు వెళ్లనున్న హ్యుండాయ్ మోటార్ ఇండియా సైతం ఇతర కార్ల తయారీ సంస్థలతో పోటీ పడుతోంది. ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి పోటీ ఎదురవ్వడంతో హ్యుండాయ్ సైతం వచ్చే సెప్టెంబర్ లో అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ (Alcazar Facelift) కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
2021లో తొలిసారి భారత్ మార్కెట్లో అల్కాజర్ (Alcazar) కారును ఆవిష్కరించింది హ్యుండాయ్ మోటార్ ఇండియా. దీని ధర రూ.16.77 లక్షల నుంచి రూ.21.28 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. 2021-22లో 25,894, 2022-23లో 26,696, 2023-24లో 20,753 అల్కాజర్ కార్లు అమ్ముడయ్యాయి.
హ్యుండాయ్ అల్కాజర్ రెండు ఇంజిన్ ఆప్షన్లు – 1.5 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ విద్యు్త్, 253 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల సీఆర్డీఐ డీజిల్ (116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్) వెలువరిస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 7-స్పీడ్ డీసీటీ, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ చాయిస్ ల్లో లభిస్తోంది. త్వరలో రానున్న అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ కారు ఇదే పవర్ ట్రైన్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుందని భావిస్తున్నారు.
హ్యుండాయ్ అల్కాజర్ ఫీచర్లతో కూడిన ఎస్ యూవీగా ఉంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్ రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 8-స్పీకర్ బోస్ ఆడియో సెటప్, ఎయిర్ ప్యూరిఫయర్, డాష్ కామ్ విత్ డ్యుయల్ కెమెరా, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, బ్లూ లింక్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి.
హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) తదితర ఫీచర్లు జత చేశారు. దీని ధర రూ.17 లక్షల నుంచి రూ.23 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. అల్కాజర్తోపాటు ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో హ్యుండాయ్ ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, టక్సన్, ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కార్ కూడా తయారు చేస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

