Kia Seltos Facelift | తొలి రోజే అదరగొట్టిన కియా సెల్టోస్.. ఎంత మంది ప్రీ-బుకింగ్స్ చేసుకున్నారంటే..?!
Kia Seltos Facelift | కియా ఇండియా ఇటీవల ఆవిష్కరించిన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. ప్రీ బుకింగ్స్‌లో తొలి రోజే రికార్డు నెలకొల్పింది. 13,424 కార్లు ప్రీ-బుక్ కాగా, వాటిల్లో 1973 కార్లు కే-కోడ్ ద్వారా బుక్ చేసుకున్నారు.
Kia Seltos Facelift | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. ఇటీవల దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన మిడ్ సైజ్ ఎస్యూవీ- సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ రికార్డులు నెలకొల్పుతున్నది. ఈ నెల నాలుగో తేదీన మార్కెట్లో ఆవిష్కరించిన ఈ కారు ప్రీ-బుకింగ్స్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే 13,424 మంది కార్లు బుక్ చేసుకున్నారు. వారిలో 1973 మంది కొత్తగా కియా ఇండియా తీసుకొచ్చిన ‘కే-కోడ్ (K-code)’ ద్వారా బుక్ చేసుకున్నారు. కే-కోడ్ ద్వారా బుక్ చేసుకున్న వారికి కార్ల డెలివరీలో తొలి ప్రాధాన్యం లభిస్తుంది.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు కొనుక్కునే వారు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా గానీ, వారి సమీప కియా డీలర్ల వద్ద ఆఫ్‌లైన్‌లో గానీ రూ.25 వేలు టోకెన్ మనీ చెల్లించి ప్రీ-బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. వచ్చేనెలలో కారు ధర వెల్లడించనున్నట్లు తెలుస్తున్నది. దీని ధర రూ.10 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చునని తెలుస్తున్నది.
2019లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొడక్షన్ యూనిట్ నుంచి ఇప్పటివరకు 10 లక్షల సెల్టోస్ కార్లు విక్రయించింది కియా ఇండియా. తాజాగా మార్కెట్లో ఆవిష్కరించిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. 10,00,001వ కారుగా నిలువనున్నది. కియో సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారు పనోరమిక్ సన్‌రూఫ్ విత్ వాయిస్ కంట్రోల్, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ లెవెల్ టూ (అడాస్-2), 32కి పైగా సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నది.
ఎక్స్-లైన్, జీటీ లైన్, టెక్-లైన్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్న కియా సెల్టోస్.. ఏడు కలర్స్ & 2 డ్యుయల్ టోన్ కలర్ ఆప్షన్లలో రానున్నది. మారుతి గ్రాండ్ విటారా, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, ఎంజీ అస్టర్తోపాటు త్వరలో మార్కెట్లోకి రానున్న సిట్రోన్ సీ3 ఎయిర్ క్రాస్ మోడల్ కార్లతో తల పడనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

