New Honda Activa | మార్కెట్లోకి న్యూ హోండా యాక్టీవా.. ధరెంతో తెలుసా?!
New Honda Activa | హోండా మోటార్ బైక్స్ అండ్ స్కూటర్స్ ఇండియా.. విపణిలోకి కొత్త ప్రీమియం హోండా యాక్టీవాను విడుదల చేసింది.
New Honda Activa | హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్ మార్కెట్లోకి హోండా యాక్టీవా ప్రీమియం ఎడిషన్ తీసుకొచ్చింది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ హోండా, హోండా యాక్టీవా 125, హోండా యాక్టీవా ప్రీమియం వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు. ప్రీమియం ఎడిషన్ హోండా యాక్టీవా ధర రూ.75,400. యాక్టీవా డీఎల్ఎక్స్ వేరియంట్ ధర మరో రూ.1000 అదనం.
యాక్టీవా ప్రీమియం ఎడిషన్‌లో 3డీ గోల్డ్ కోట్ ఎంబ్లం, బ్రౌన్ కలర్డ్ ఇన్నర్ బాడీతోపాటు గోల్డెన్ వీల్స్, సీట్ కవర్స్ వస్తాయి. గోల్డ్ కోటెడ్ క్రోమ్ ఫ్రంట్ గార్నిష్తోపాటు గోల్డెన్ మార్క్ హోండా ఆప్రాన్ ఉంటుంది. ఈ మోడల్ యాక్టీవా మాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మాట్ సంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ సెరెన్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ప్రస్తుత హోండా యాక్టీవా మోడల్లోనూ ప్రీమియం హోండా యాక్టీవా కూడా 109.5సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5500 ఆర్పీఎం వద్ద 5.73 కిలోవాట్ల విద్యుత్, గరిష్ఠంగా 5500 ఆర్పీఎం వద్ద 8.84 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 106 కిలోల బరువు గల స్కూటర్లో 5.3 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ప్రీమియం ఎడిషన్ 130 ఎంఎం ఫ్రంట్, 130 ఎంఎం రేర్ బ్రేక్‌లు కలిగి ఉంటుంది.
యాక్టీవా ప్రీమియం ఎడిషన్ స్కూటర్ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. 3.0.ఏహెచ్ బ్యాటరీ, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. 1833 మి.మీ పొడవు, 697 మి.మీ వెడల్పుతోపాటు 1156 ఎంఎం ఎత్తు వస్తుంది. 1260 మి.మీ వీల్ బేస్‌తో వస్తుంది. హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ .. మార్కెట్లోకి న్యూ సీబీ300 ఎఫ్ బైక్‌ను ఆవిష్కరించింది. ఇది 2 డీలక్స్, డీలక్స్ ప్రో వేరియంట్లలో లభ్యం అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

