బిలియన్ డాలర్ల క్షీణత
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. నవంబర్ 4తో ముగిసిన వారంలో ఇవి 1.087 బిలియన్ డాలర్ల మేర తగ్గి 529.994 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఎన్నో వారాలుగా అదేపనిగా పడిపోతున్న విదేశీ మారక నిల్వలు ఎట్టకేలకు అక్టోబర్ 28తో ముగిసిన వారంలో భారీగా 6 బిలియన్ డాలర్లు పెరిగిన సంగతి తెలిసిందే
న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. నవంబర్ 4తో ముగిసిన వారంలో ఇవి 1.087 బిలియన్ డాలర్ల మేర తగ్గి 529.994 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. ఎన్నో వారాలుగా అదేపనిగా పడిపోతున్న విదేశీ మారక నిల్వలు ఎట్టకేలకు అక్టోబర్ 28తో ముగిసిన వారంలో భారీగా 6 బిలియన్ డాలర్లు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే బంగారం నిల్వల్లో తగ్గుదల ఏర్పడటంతో తాజాగా ఫారెక్స్ (ఫారిన్ ఎక్సేంజ్) రిజర్వులు తిరిగి తగ్గాయి. 2021 అక్టోబర్‌లో 645 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరిన తర్వాత విదేశీ మారక నిల్వలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయంగా చమురు, ఇతర కమోడిటీ ధరలు భగ్గుమనడంతో ఎక్కువ విదేశీ కరెన్సీని ఖర్చుచేయడం, రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్‌బ్యాంక్ డాలర్లు విక్రయించడం నిల్వలు తగ్గుదలకు ప్రధాన కారణం. ఆర్బీఐ విడుదల చేసిన వారాంతపు గణాంకాల ప్రకారం తాజాగా ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 120 మిలియన్ డాలర్ల మేర తగ్గి 470.727 బిలియన్ డాలర్లకు చేరాయి. యూరో, పౌండ్, యెన్ల విలువను సైతం డాలర్ రూపంలో గణించి విదేశీ కరెన్సీ ఆస్తుల్ని లెక్కిస్తారు. బంగారం నిల్వల విలువ 705 మిలియన్ డాలర్లు క్షీణించి 37.057 బిలియన్ డాలర్లకు చేరింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 235 మిలియన్ డాలర్లు తగ్గి 17.39 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అలాగే ఐఎంఎఫ్ వద్దగల భారత్ విదేశీ రిజర్వులు సైతం 27 మిలియన్ డాలర్ల క్షీణతతో 4.82 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

