Zepto Startup for Grocery delivery | స్టాన్‌ఫర్డ్‌లో చదువొదిలేశారు.. స్టార్టప్ బాట పట్టారు..!
Zepto Startup For Grocery Delivery | కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ లో కోర్సు మధ్యలో వదిలేసిన ముంబై కుర్రాళ్లు.. స్టార్టప్ ప్రారంభించారు.

Zepto Startup for Grocery delivery | కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ స్టాన్‌ఫర్డ్ వర్సిటీ.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో విద్యార్థులు ఇందులో అడ్మిషన్ కోసం కలలు కంటుంటారు.. ఈ సంస్థలో అడ్మిషన్ లభిస్తే వారి భవితవ్యమే మారిపోతుంది. కానీ ఇద్దరు ముంబై కుర్రాళ్లు.. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ కోర్సులో గతేడాదే చేరారు.
కరోనా లాక్‌డౌన్‌తో పుంజుకున్న ఆన్లైన్ బిజినెస్
కానీ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి అమలు చేసిన లాక్డౌన్లు, ఆంక్షలతో ఆన్లైన్ బిజినెస్ శరవేగంగా పెరగడాన్ని గమనించారు. తామూ ఆ బిజినెస్‌లో భవితవ్యాన్ని చూసుకోవాలనుకున్నారు ఆ కుర్రాళ్లు అంతే.. స్టాన్‌ఫర్డ్‌లో తమ కోర్సును మధ్యలోనే వదిలేశారు. ఆన్లైన్లో ఆర్డర్‌పై 10 నిమిషాల్లో గ్రాసరీ వస్తువులు సరఫరా చేయడానికి స్టార్టప్ ప్రారంభించారు. ఆ స్టార్టప్ పేరు జెప్టో.. వారు.. ఆదిత్య పాలిచా.. కైవల్య వోహ్రా అనే ముంబై కుర్రాళ్లు.

గ్రాసరీ డెలివరీ కోసం జెప్టో స్టార్టప్.. 6 కోట్ల డాలర్ల పెట్టుబడులు!

ఆదిత్య పాలిచా.. కైవల్య వోహ్రా అనే ఇద్దరు ముంబై కుర్రాళ్లు.. ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సును వదిలేశారు.. పది నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ కోసం ఈ ఏడాది ప్రారంభంలో జెప్టో యాప్ అనే పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఇందులో వై కాంబినేటర్, గ్లాడ్ బ్రూక్ క్యాపిటల్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థలు 6 కోట్ల డాలర్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి.
ఏంజిల్ ఇన్వెస్టర్ల మద్దతు ఇలా
ఈ స్టార్టప్‌కు నెక్సస్ వెంచర్, గ్లోబల్ ఫౌండర్స్, సిలికాన్ వ్యాలీలోని ఏంజిల్ ఇన్వెస్టర్లు లాచీ గ్రూమ్, నీరజ్ అరోరా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం తమ సంస్థ విలువ 20 కోట్ల నుంచి 30 కోట్ల డాలర్లు ఉంటుందని జెప్టో సహ-వ్యవస్థాపకుడు, సీఈవో పాలిచా చెప్పారు.

ఈ సంస్థలకు గట్టి పోటీ..
సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్ దన్నుతో పనిచేస్తున్న గ్రోఫర్స్, గూగుల్ మద్దతు గల డంజో ఆధ్వర్యంలోని క్విక్ కామర్స్ (క్యూ-కామర్స్)కు జెఫ్టో పోటీ ఇవ్వనున్నది. మైక్రో వేర్‌హౌసెస్ నెట్‌వర్క్‌తో బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల వాసులకు 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేసే లక్ష్యంతో పని చేస్తున్నది.
త్వరలో హైదరాబాద్‌లో విస్తరణ
త్వరలో హైదరాబాద్, పుణె, కోల్‌కతా, చెన్నైనగరాలకు తమ సేవలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించుకున్నది జెప్టో. తమ సంస్థ లావాదేవీలు, సేవలు ప్రతినెలా 200 శాతం స్థిరంగా పెరుగుతున్నాయంటున్నారు పాలిచా.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి:
సికింద్రాబాద్‌లో ఆటోమేటిక్ మెషిన్‌తో పానీపూరి సర్వ్..
Nokia T20 : నోకియా నుంచి అద్భుతమైన ఫీచర్లతో ట్యాబ్.. ధర కూడా తక్కువే
Talk about luck: ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
కోహ్లీసేన మైండ్‌సెట్ సరిగాలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

