Mercedes-Benz | మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంచలన వ్యాఖ్యలు.. మెర్సిడెజ్ బెంజ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నదని ఆరోపణ..!
Mercedes-Benz | పుణెలోని మెర్సిడెజ్ బెంచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ‘నాన్ కంప్లియెన్స్’, ‘పర్యావరణ ప్రమాణాలు’ పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది.
Mercedes-Benz | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా (Mercedes Benz India) పై మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుణెలోని మెర్సిడెజ్ బెంచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ‘నాన్ కంప్లియెన్స్’, ‘పర్యావరణ ప్రమాణాలు’ పాటించడం లేదని ఆరోపించింది. ఈ ప్లాంట్ నిర్వహణపై సమగ్ర సమీక్ష జరుపాలని అధికారులను ఆదేశించింది. అయితే తమకు నిబంధనల ఉల్లంఘన విషయమై మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ) నుంచి ఎటువంటి రాతపూర్వక నోటీసు గానీ, సూత్రప్రాయ సూచన గానీ రాలేదని మెర్సిడెజ్ బెంచ్ పేర్కొంది. అవసరమైతే ఎటువంటి చర్యలు చేపట్టేందుకైనా సిద్ధమేనని పేర్కొంది.
శుక్రవారం పుణె మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను తనికీ చేసిన తర్వాత ‘మార్గదర్శకాల ఉల్లంఘన’ జరుగుతున్నదని ఎంపీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. చకాన్ లోని మెర్సిడెజ్ బెంజ్ అసెంబ్లింగ్ యూనిట్ లో కాలుష్య నియంత్రణ మార్గదర్శకాల అమలు విషయంలో తగు చర్యలు తీసుకోవాలని తమ ప్రాంతీయ అధికారిని ఎంపీసీబీ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు మెర్సిడెజ్ బెంచ్ ఇచ్చిన రూ.25 లక్షల బ్యాంక్ గ్యారంటీని జప్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే తాము కార్ల తయారీలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. రెగ్యులేటరీ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తామని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

