Motorola Razr 50 Ultra | ప్రీమియం సెగ్మెంట్లో మరో ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఆవిష్కరణ..!
Motorola Razr 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన ప్రీమియం ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Motorola Razr 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన ప్రీమియం ఫోన్ మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్3 (Qualcomm Snapdragon 8s Gen 3) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గతేడాది మార్కెట్లోకి విడుదల చేసిన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రాతో పోలిస్తే మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ డిస్ ప్లే 4-అంగుళాల కవర్ డిస్ ప్లే ఎక్కువగా ఉంటుంది.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.99,999 పలుకుతుంది. మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, స్పెషల్ ఎర్లీ బడ్ సేల్స్ లో భాగంగా రూ.5000 డిస్కౌంట్ తో రూ.94,999లకు లభ్యం అవుతుంది. ఇక సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై చెల్లింపులతో ఫోన్ కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 ఇన్ స్టంట్ క్యాష్ డిస్కౌంట్, రూ.5,000లతో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ప్రారంభం అవుతుంది. రిలయన్స్ జియో నుంచి ఆఫర్ల బండిల్ రెడీగా ఉంటుంది.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 413 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2640 పిక్సెల్స్) ఎల్టీపీఓ ఇన్నర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కవర్ డిస్ ప్లే 4 అంగుళాల (1080×1272 పిక్సెల్స్) ఎల్టీపీఓ పోలెడ్ ప్యానెల్ డిస్ ప్లే విత్ హెచ్డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ డ్యుయల్ ఔటర్ కెమెరా సెటప్ (50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్)తోపాటు ఇన్నర్ డిస్ ప్లేతో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. యాక్షన్ ఇంజిన్, ఆటో స్మైల్ క్యాప్చర్, గెశ్చర్ క్యాప్చర్ వంటి పలు విభిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ జత చేశారు.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా (Motorola Razr 50 Ultra) ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. బయో మెట్రిక్ అథంటికేషన్ అండ్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, సాఫ్ట్ వేర్ బేస్డ్ ఫేస్ అన్ లాక్ ఫీచర్, యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, ప్రాగ్జిమిటీ లైట్ సెన్సర్ తదితర సెన్సర్లు ఉన్నాయి.45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు, 15వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతు, 5వాట్ల రివర్స్ చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కూడా ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

