Motorola Razr 40 Ultra- Edge 40 Neo | న్యూ కలర్లో మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా.. ఎడ్జ్ 40 నియో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్లో ఆవిష్కరించింది.
Motorola Razr 40 Ultra- Edge 40 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra), మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) తాజాగా నూతన కలర్ వేరియంట్లో ఆవిష్కరించింది. న్యూ పీచ్ ఫుజ్ కలర్ ఆప్షన్లో మార్కెట్లోకి ఎంటరైంది. శనివారం నుంచి ఈ ఫోన్లు మార్కెట్లో లభిస్తాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా (Motorola 40 Ultra) ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో (Motorola Edge 40 Neo) ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుంది. ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తాయి.
మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ పీచ్ ఫుజ్ కలర్ వేరియంట్ ఫోన్.. ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, కంపెనీ వెబ్సైట్, లీడింగ్ రిటైల్ స్టోర్లలో స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ కింద రూ.69,999లకు లభిస్తుంది. ఈ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఫోన్.. ఇన్ఫినైట్ బ్లాక్, వివా మేజెంటా, గ్లాసియర్ బ్లూ షేడ్ కలర్స్ లో లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999లకు ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా వెబ్సైట్ ద్వారా లభిస్తుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999లకు సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ బ్యూటీ, కనీల్ బే, సూథింగ్ సీతోపాటు పీచ్ ఫుజ్ కలర్లో లభిస్తుంది. ఈ ఫోన్లను గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లో ఆవిష్కరించింది.
మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఫోల్డబుల్ పోలెడ్ డిస్ ప్లే విత్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 3.6 అంగుళాల (1056×1066 పిక్సెల్స్) పోలెడ్ ఔటర్ పానెల్ విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) పోలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. రెండు మోడల్ ఫోన్లూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 30 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 5వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 3800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ 68 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
దీపం వెలిగించి వెళ్లిన కొద్దిసేపటికే అగ్నికి ఆహుతైన ఇల్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

