Motorola Edge 50 Ultra | త్వరలో భారత్ మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Motorola Edge 50 Ultra | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్తోపాటు గత ఏప్రిల్ నెలలో గ్లోబల్ మార్కెట్లలో మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్నూ ఆవిష్కరించారు. ప్రస్తుతం భారత్ మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ లభిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, వైర్డ్ అండ్ వెర్లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ కలిగి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ కూడా గత ఏప్రిల్లోనే భారత్ మార్కెట్లో ఆవిష్కరించారు. గత ఏప్రిల్ లో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్లో ఉన్న ఫీచర్లే భారత్ వేరియంట్ లోనూ వినియోగిస్తారని తెలుస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + పోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ తోపాటు ఒక టిగా బైట్ వరకూ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ వర్షన్ మీద పని చేస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ విత్ అప్ టూ 3ఎక్స్ జూమ్, సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా ఫోన్ 125 వాట్ల వైర్డ్, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4,500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. డ్యుయల్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, నేవ్ ఐసీ, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉండటంతోపాటు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఇచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

