Moto G34 5G | మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Moto G34 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ‘మోటో జీ34’ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Moto G34 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ34 5జీ ఫోన్ ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 పలుకుతుంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 17 నుంచి ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్, మోటరోలా అధికార వెబ్ సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
మోటో జీ 34 5జీ ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలలో లభిస్తుంది. ఐస్ బ్లూ, చార్ కోల్ బ్లాక్, ఓషన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తున్నది. గ్రీన్ కలర్ వేరియంట్ బ్యాక్ ప్యానల్ వెగాన్ లెదర్ ఫినిష్ కలిగి ఉంటుంది.
120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే (1600×720 పిక్సెల్స్ రిజొల్యూషన్) కలిగి ఉంటుంది. గరిష్టంగా 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ అందిస్తుంది. 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కూడా ఇస్తారు. 20వాట్ల టర్బో చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ వస్తుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో అత్యంత వేగంగా పని చేస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్ ఇది. 3.5 ఎంఎం ఆడియో జాక్, డేటా ట్రాన్స్ ఫర్, చార్జింగ్ కోసం యూఎస్బీ కేబుల్ సపోర్ట్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

