Moto G04s | మోటో నుంచి మరో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఆవిష్కరణ ఎప్పుడంటే..?!
Moto G04s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో గో4ఎస్ (Moto G04s) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఈ నెల 30న ఆవిష్కరించనున్నది.
Moto G04s | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో గో4ఎస్ (Moto G04s) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఈ నెల 30న ఆవిష్కరించనున్నది. ఈ నెల 16న భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో ఎడ్జ్ 50 ఫ్యుజన్ ఫోన్ కొనసాగింపుగా వస్తున్న రెండో స్మార్ట్‌ఫోన్ ఇది.
యూరప్ మార్కెట్లలో ఆవిష్కరించిన ఫోన్ లో మాదిరిగానే భారత్ మార్కెట్లోనూ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ606 ఒక్టాకోర్ ప్రాసెసర్ విత్ 4జీబీ ర్యామ్ ఉంటుంది. వర్చువల్ గా ర్యామ్ మరో 4జీబీ పెంచుకోవడంతోపాటు 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ ఆడియో మద్దతుతో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది.
మోటో గో4ఎస్ ఫోన్ సింగిల్ 50-మెగా పిక్సెల్ ఏఐ పవర్డ్ రేర్ కెమెరా అండ్ ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్ కు ఈ ఫీచర్ మద్దతుగా ఉంటుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ వస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంటది. యూరప్ మార్కెట్లో మోటో గో4ఎస్ ఫోన్ 119 యూరోలు ఉంటుంది. భారత్ మార్కెట్లోనూ రూ.10,700లకే లభిస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

