Bankers No for Future-Reliance | ఆ డీల్‌కు బ్యాంకర్ల రెడ్ సిగ్నల్..?
Bankers No for Future-Reliance | ఫ్యూచర్గ్రూప్కు రుణాలిచ్చిన దేశీయ బ్యాంకర్లు రిలయన్స్‌కు ఆ సంస్థ విక్రయానికి నో అన్నట్లు సమాచారం.
Bankers No for Future-Reliance | అప్పులతోపాటు 2020లో కరోనా మహమ్మారి ప్రభావంతో విక్రయాలు సాగక ఫ్యూచర్ రిటైల్ నెట్వర్క్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నది. వివిధ బ్యాంకుల రుణాలు, బాండ్ల చెల్లింపుల కోసం ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఫ్యూచర్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిపై గ్లోబల్ ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌తో ఫ్యూచర్ న్యాయ వివాదాన్ని ఎదుర్కొంటున్నది. సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు కోసం ఇరు పక్షాలు వేచి చూస్తున్నాయి. కానీ, రిలయన్స్ రిటైల్‌కు విక్రయిస్తూ ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న ఒప్పందాన్ని మెజారిటీ బ్యాంకర్లు, వాటాదారులు ఆమోద ముద్ర వేయలేదని సమాచారం.
ఫలించని ఫ్యూచర్ ప్రయత్నాలు
ఈ లోగా రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి వాటాదారులు, అనుబంధ సంస్థలు, రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఆమోదం కోసం ఫ్యూచర్ మేనేజ్మెంట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తున్నది. రిలయన్స్‌కు ఫ్యూచర్ ఆస్తుల విక్రయానికి ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా మెజారిటీ బ్యాంకర్లు ఓటేసినట్లు సమాచారం. ఓవర్సీస్ బాండ్ల కొనుగోలుదారులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు మాత్రం ఫ్యూచర్‌కు అనుకూలంగా ఓటేసినట్లు వినికిడి. గురువారం ఓటింగ్ జరిగింది.
ఫ్యూచర్ విఫలమైతే ఇలా
రుణ దాతలు, వాటాదారుల్లో మెజారిటీ మద్దతు కూడగట్టడంలో ఫ్యూచర్ విఫలమైతే బ్యాంకర్ల రుణ బకాయిల్లో తక్కువ మొత్తంలో మాత్రమే రికవరీ అవుతాయి. ఫ్యూచర్ రిటైల్ అనుబంధ సంస్థలకు రుణాలిచ్చిన మొత్తం రుణ దాతల్లో 80 శాతం దేశీయ బ్యాంకులే. ఒకవేళ స్కీమ్‌కు ఆమోదం తెలిపితే కనీసం 75 శాతం క్రెడిటర్లు అనుకూలంగా ఉండాలని, సమావేశంలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది అనుకూలంగా ఓటేయాలని చెబుతున్నారు. ఓటింగ్ జరిగిన 48 గంటల్లోపు స్టాక్ ఎక్స్చేంజ్లకు ప్యూచర్ తెలియజేయాల్సి ఉంటుంది.
ఫ్యూచర్ ప్లాన్‌లో అసమానతలు.. వ్యతిరేకించిన బ్యాంకర్లు
ఫ్యూచర్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశం శనివారం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ల్లో మెజారిటీ రిలయన్స్‌లో ఫ్యూచర్ విలీనానికి ససేమిరా అన్నట్లు సమాచారం. విదేశీ సంస్థల బాండ్లను పూర్తిగా రిలయన్స్ చెల్లించనున్నది. కానీ దేశీయ బ్యాంకుల రుణ బకాయిల్లో 50 శాతం మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. రుణ బకాయిల చెల్లింపులపై ఫ్యూచర్ ప్లానింగ్‌లో అసమానతలు ఆమోద యోగ్యం కాదని బ్యాంకర్లు అంటున్నారు. 45 శాతం రుణ బకాయిలు రూ.12,612 కోట్లను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఫ్యూచర్ బదిలీ చేస్తుంది. ఆ రుణాలు ఏడేండ్లలో దశల వారీగా చెల్లించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
Telangana Urban Projects | తెలంగాణలో ఐదు పట్టణ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం.. రూ.873 కోట్లు విడుదల
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

