Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Most Affordable Cars | మీరు రూ.5 లక్షల్లోపు ధరకే కారు కొనుక్కోవాలనుకుంటున్నారా.. ఇన్ పుట్ కాస్ట్ పెరగడం వల్ల పలు కంపెనీలు ఎంట్రీ లెవల్ కార్ల తయారీ తగ్గించినా. మారుతి, రెనాల్ట్ ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయి. మారుతి ఆల్టో కే10, మారుతి ఎస్-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ కార్లు రూ.5 లక్షల్లోపు ధరకే లభిస్తాయి.
Most Affordable Cars | మీరు రూ.5 లక్షల్లోపు (ఎక్స్ షోరూమ్) ధర గల కారు కోసం చూస్తున్నారా..? ఒకప్పుడు పలు మోడల్ కార్లు ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు.. ఇప్పుడు కార్లు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కొన్ని కార్ల తయారీ సంస్థలు తెచ్చిన చౌక కార్లు భారత్ కు దూరం అయ్యాయి. మరికొన్ని సంస్థలు ప్రీమియం కార్లపైనే దృష్టి పెట్టడంతో తక్కువ ధర గల కార్ల తయారీని పట్టించుకోలేదు. అయితే, కేవలం మూడు కార్లు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మారుతి సుజుకి ఆల్టో కే10 (Maruti Suzuki Alto K10), మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso), రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) మాత్రమే తక్కువ ధరకు లభిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందామా..!
మారుతి సుజుకి ఆల్టో కే10 ఇలా

భారత్ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో మారుతి సుజుకి ఆల్టో ఒకటి. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు కూడా ఇదే. అయితే తొలి నాళ్లలో అందుబాటులో ఉన్న ఆల్టో800 కారును మారుతి డిస్ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఆల్టో కే10 మాత్రమే లభిస్తోంది. మారుతి సుజుకి ఆల్టో కే10 కారు రూ.3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. 1.0 లీటర్ల కే10సీ పెట్రోల్ ఇంజిన్ తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 67 పీఎస్ విద్యుత్, 89 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. మీరు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ (5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఇలా మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి సుజుకి నుంచి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న మరో కారు ఎస్-ప్రెస్సో (S-Presso). ఈ కారు ధర రూ.4.26 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఆల్టో కే10 కారులో వాడే ఇంజిన్ నే ఇందులోనూ వాడుతున్నారు. బేస్ వేరియంట్ విత్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ కారు మాత్రమే రూ.5 లక్షల (ఎక్స్) కంటే తక్కువ ధరకు లభిస్తుంది.
రెనాల్ట్ క్విడ్ ధరెంతంటే..

రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) కారు ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కారు. ఒకప్పుడు 0.8 లీటర్లు, 1.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన రెనాల్ట్ క్విడ్.. ఇప్పుడు పెద్ద ఇంజిన్ మాత్రమే కొనసాగిస్తున్నది. దీని ధర రూ.4.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ కారు 1.0 లీటర్ల ఎస్సీఈ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 68 పీఎస్ విద్యుత్, 91 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కారు మాత్రమే రూ.5 లక్షల్లోపు ధరకు లభిస్తుంది.

ఇన్ పుట్ కాస్ట్స్ పెరిగి పోవడంతో కార్లు మరింత పిరం అయ్యాయి. ఇన్ పుట్ కాస్ట్స్లో మెటీరియల్ కాస్ట్ పెరిగి పోయింది. కార్ల తయారీ దార్లు గరిష్టంగా ఇన్ పుట్ కాస్ట్ తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఇన్ పుట్ కాస్ట్ భారాన్ని కార్ల తయారీ సంస్థలు వేర్వేరు మోడల్ కార్ల విక్రయం ద్వారా కస్టమర్ల మీద మోపుతారు. కొన్ని కార్లు ఇంతకుముందు రూ.5 లక్షల్లోపు ధరకే అందుబాటులో ఉన్నా.. ఇన్ పుట్ కాస్ట్స్ వల్ల ఆ లిమిట్ దాటేశారు. మరోవైపు ఎంట్రీ లెవల్ కార్లకు గిరాకీ తగ్గుతుందని చెప్పడానికి ఆయా కార్ల విక్రయాలే నిదర్శనం. చాలా మంది కార్ల కొనుగోలుదారులు భారీగా మనీ చెల్లించి.. ఎస్యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

