Moody’s – GDP | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటులో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ’స్..!
Moody's - GDP | ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ’స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది.
Moody’s – GDP | ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ’స్ (Moody’s) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24) వృద్ధిరేటు 8.2శాతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల నేపథ్యంలో వృద్ధిరేటు అంచనాలు తగ్గిస్తున్నట్లు మూడీ’స్ పేర్కొంది. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కొనసాగుతుందని వెల్లడించింది. 2023-24తో పోలిస్తే తలసరి ఆదాయం 10,233 డాలర్లతో 11 శాతం పెరిగింది.
ఇంతకు ముందు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7 నుంచి 6.4 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023-24లో జీడీపీ 8.2 శాతంగా నిలిచింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధిరేటు గణనీయంగా పతనమైంది.
గత డిసెంబర్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సైతం భారత్ వృద్ధిరేట్ అంచనాలను సవరించింది. 2023-24లో భారత్ వృద్ధిరేటు 6.5 శాతమేనని ఏడీబీ పేర్కొంది. పారిశ్రామిక వృద్ధి బలహీనం, ప్రభుత్వ వ్యయం తగ్గింపు దీనికి కారణం అని వెల్లడించింది. ఇండ్ల డిమాండ్‌పై కఠిన ద్రవ్య పరపతి విధానంతో 2025-26లో జీడీపీ 7.2 నుంచి ఏడు శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

