INCOVACC | భారతదేశపు తొలి నాజల్ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఇది గర్వించదగ్గ విషయం : భారత్ బయోటెక్ ఎండీ
ప్రపంచవ్యాప్తంగా మొదటి దశ, హెటిరోలాగస్ బూస్టర్ డోసు అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్
INCOVACC : కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించేందుకు భారత్ బయోటిక్ తయారుచేసిన నాజిల్ వ్యాక్సిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) అమోదం లభించింది. ఈ వ్యాక్సిన్ పేరు ఇన్వాక్ (Incovacc). దీనికే BBV154 అనే పేరుంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు, ఆ పైబడిన వాళ్లకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇవ్వాలని సీడీఎస్సీఓ సూచించింది. దాంతో, హెటిరోలాగస్ బూస్టింగ్ ఇవ్వనున్నారు. హెటిరోలాగస్ బూస్టింగ్ అంటే.. మొదటి డోస్‌లో ఇచ్చిన వ్యాక్సిన్ కంటే భిన్నమైన వ్యాక్సిన్‌ను ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా మొదటి దశ, హెటిరోలాగస్ బూస్టర్ డోసు అనుమతి పొందిన మొదటి వ్యాక్సిన్‌గా ఇన్వాక్ గుర్తింపు సాధించింది.
మూడో దశ కంట్రోల్డ్ క్లినికల్ ట్రయల్స్‌లో ఇన్వాక్ సురక్షితమని, ఇమ్యూనిటీ పెంచుతుందని, దుష్పరిణామాలు ఉండవని తేలింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా మొదటి దశ, రెండో దశలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
‘ఇన్వాక్ వ్యాక్సిన్ అనేది ప్రైమరీ 2 డోసులో ముక్కులోపల ఇచ్చే వ్యాక్సిన్. కరోనాకు నాజల్ వ్యాక్సిన్ తయారుచేయడం పెద్ద విజయంగా భావిస్తున్నాం. ఈ వ్యాక్సిన్ సురక్షితమైనది. దీన్నిఇచ్చేటప్పుడు ఏమాత్రం నొప్పి ఉండదు. అంతేకాదు కరోనా వేరియెంట్లకు తగ్గట్టుగా వ్యాక్సిన్ తయారు చేసే పనుల్లో ఉన్నాం’ అని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

