Honda Elevate | బెటర్ మైలేజీ ఆప్షన్ హోండా ఎలివేట్ స్పెషాలిటీ..?!
Honda Elevate |ఎస్యూవీ కార్లలో హోండా ఎలివేట్ మెరుగైన మైలేజీ ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌పై 15.31 కి.మీ, సీవీటీ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 16.92 కి.మీ మైలేజీ ఇస్తుంది.
Honda Elevate | ఇప్పుడంతా స్పేసియస్‌గా స్పోర్ట్స్ యుటిలిటీ.. మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతోంది. ఈ క్రమంలో జపాన్ కార్ల తయారీ సంస్థ.. హోండా కార్స్.. దేశంలో శరవేగంగా పెరుగుతున్న ఎస్యూవీ కార్ల మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లతో సిటీ సెడాన్ తరహాలో ఎక్స్టర్ తెస్తున్నది.
1.5-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 121 హెచ్‌పీ విద్యుత్, 145 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తోపాటు అదనంగా 7-స్టెప్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది.
మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ గల హోండా ఎలివేట్ లీటర్ పెట్రోల్‌పై 15.31 కి.మీ మైలేజీ ఇస్తుంది. సీవీటీ ఆప్షన్ గల కారు లీటర్ పెట్రోల్ మీద 16.92 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ నెల నాలుగో తేదీన వేరియంట్ల వారీగా ఎలివేట్ కారును ఆవిష్కరించింది హోండా..
నాలుగు వేరియంట్లు (ఎస్వీ, వీ, వీఎక్స్, జడ్ఎక్స్), పది కలర్స్ ఆప్షన్లలో హోండా ఎలివేట్ లభిస్తుంది. ఈ నెల మూడో తేదీ నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.21 వేలు పే చేసి హోండా ఎలివేట్ ప్రీ-బుక్ చేసుకోవచ్చు. వచ్చేనెల మధ్యలో మార్కెట్లో ఆవిష్కరించే ఎలివేట్ కారు డెలివరీ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

