MG ZS EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. దేశీయ మార్కెట్లో సెకండ్ లెవల్ అడాస్ సిస్టమ్‌తో డెవలప్ చేసిన జడ్ఎస్ ఈవీ ఎస్యూవీ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.27.89 లక్షలకు లభిస్తుంది. 2020 జనవరిలో జడ్ఎస్ ఈవీ కారును ఆవిష్కరించింది. నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ కారు మూడు వేరియంట్లు – ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్లలో లభిస్తుంది. టాప్ హై ఎండ్ వేరియంట్ ఎక్స్ క్లూజివ్ ప్రో వేరియంట్లో సెకండ్ లెవెల్ అడాస్ టెక్నాలజీ ఉంటుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్‌లో లభిస్తుంది. కేవలం 8.5 సెకన్ల వ్యవధిలో 100 కి.మీ వేగం అందుకుంటుంది.
జడ్ఎస్ ఈవీ ఎక్సైట్ – రూ.23.38 లక్షలు
జడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ – రూ.27.30 లక్షలు
జడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ డ్యుయల్ టోన్ – రూ.27.40 లక్షలు
జడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ప్రో – రూ.27.90 లక్షలు
జడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ ప్రో డ్యుయల్ టోన్ – రూ.28 లక్షలు
ఎంజీ జడ్ఎస్ ఈవీ ఎస్యూవీ లెవెల్ 2 అడాస్ టెక్నాలజీ మూడు స్థాయిల్లో పని చేస్తుంది. సెన్సిటివిటీ – లో, మీడియం, హై (low, medium and high), మూడు స్థాయిల వార్నింగ్ – హ్యాప్టిక్, ఆడియో, విజువల్ (haptic, audio and visual) హెచ్చరికల ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బెండ్ క్రూయిజ్ అసిస్టెన్స్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ లేన్ కీప్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొల్లిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ పెడిస్ట్రియన్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బ్రేకింగ్ అసిస్టెన్స్, ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్, ఇన్ఫర్మేషన్ మోడ్, మాన్యువల్ మోడ్, ఇంటెలిజెంట్ మోడ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
50.3 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీతో రూపుదిద్దుకున్న ఈ కారు ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 176.75 పీఎస్ విద్యుత్, 280 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సింగిల్ ఫుల్ చార్జింగ్ అయితే 461 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. 7.4 కిలోవాట్ల చార్జర్ సాయంతో 9 గంటల్లో వంద శాతం, 50 కిలోవాట్ల చార్జర్ సాయంతో గంటలో 80 శాతం చార్జింగ్ అవుతుంది.
ఎంజీ జడ్ఎస్ ఈవీ కారు ఫుల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీస్ కెమెరా, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
75కి పైగా కనెక్టివిటీ ఫీచర్లు గల ఈ కారు.. ఎస్యూవీ సెగ్మెంట్లోనే తొలిసారి డిజిటల్ కీ సౌకర్యంతో వస్తుంది. ఆ డిజిటల్ కీతోనే అన్ లాక్, లాక్, స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది. గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, క్యాండీ వైట్ కలర్స్ లో లభిస్తుంది. హ్యుండాయ్ కోనా ఎలక్ట్రిక్, బీవైడీ అట్టో3 ఈవీ కార్లతో పోటీ పడనున్నది.