MG Gloster Blackstorm | భారత్ మార్కెట్లోకి ఎంజీ గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ .. ధరెంతంటే..?!
MG Gloster Blackstorm | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. భారత్ మార్కెట్లోకి గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ఎస్యూవీ కారును ఆవిష్కరించింది.
MG Gloster Blackstorm | మొర్రిస్ గ్యారేజెస్ (ఎంజీ) మోటార్ ఇండియా.. భారత్ మార్కెట్లోకి గ్లోస్టర్ ఎస్యూవీ బ్లాక్ స్టోర్మ్ వేరియంట్ ఆవిష్కరించింది. ఈ కారు 6 లేదా 7 సీట్ల ఆప్షన్లతోపాటు 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ కాన్ఫిగరేషన్లతో వస్తున్నది. ఈ కారులో ఎక్స్టీరియర్గా, ఇంటీరియర్గా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ధర రూ.40.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. రెగ్యులర్ మోడల్ కారుతో పోలిస్తే దీని ధర సుమారు రూ.2.22 లక్షలు ఎక్కువ. తొమ్మిది నెలల క్రితం భారత్ మార్కెట్లోకి గ్లోస్టర్ ఎస్యూవీ రెగ్యులర్ కారు ధర రూ.31.99 లక్షలు మాత్రమే.
గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ మెటాలిక్ బ్లాక్ పెయింట్ థీమ్ విత్ రెడ్ అసెంట్స్, రూఫ్ రెయిల్స్, స్మోక్డ్ బ్లాక్ టెయిల్ లైట్స్, విండో సరౌండ్స్, ఫెండర్స్, ఫాగ్ గార్నిష్ విత్ బ్లాక్ ఫినిష్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ఇంజిన్ 2.0-లీటర్ల 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ విత్ బీఎస్-6, 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. వివిధ డ్రైవ్ మోడ్ల్లో వచ్చే ఈ కారు ఈ ఇంజిన్ గరిష్టంగా 163 బీహెచ్పీ విద్యుత్-375 ఎన్ఎం టార్చి, 218 బీహెచ్పీ విద్యుత్-480 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ ఇంజిన్ 8- స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బ్యాక్ కలిగి ఉంటది.
గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ఎస్యూవీ కారులో 30 సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. లెవెల్-1లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ఏసీసీ) తదితర ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ), ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ (ఏడీబీజీ), ఫార్వర్డ్ కొల్లిషన్ వార్నింగ్ (ఎఫ్సీడబ్ల్యూ), లేన్ డిపార్చర్ వార్నింగ్ (ఎల్డీడబ్ల్యూ), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (బీఎస్డీ), డోర్ ఓపెన్ వార్నింగ్( డీవోడబ్ల్యూ), రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ (ఆర్సీటీఏ), లేన్ చేంజ్ అసిస్ట్ (ఎల్సీఏ), డ్రైవర్ ఫాటిగ్యూ రిమైండర్ సిస్టమ్ తదితర ఫీచర్లుకూడా జత కలిశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

