Mercedes | లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గ్రూప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మెర్సిడెస్ కార్ల బ్రేకింగ్ సిస్టమ్‌లో లోపాలు ఉన్నట్లు జర్మనీ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (కేబీఏ) గుర్తించింది. 2004-2015 మధ్య నిర్మించిన ఎంఎల్, జీఎల్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్, ఆర్-క్లాస్ లగ్జరీ మినీ వ్యాన్లలో ఈ సమస్య తలెత్తినట్లు కేబీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దీన్ని మెర్సిడెజ్ యాజమాన్యం ధృవీకరించింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే బ్రేక్ బూస్టర్ దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 9.93 లక్షల వాహనాలను మెర్సిడెస్ రీ కాల్ చేయనున్నది. అందులో జర్మనీలో 70 వేల వాహనాలు ఉన్నాయి.