Maruti Suzuki | దేశీయ మార్కెట్లోకి ఎస్సీఎన్జీ ఎక్స్ఎల్ -6.. బాలెనో.. ఇవీ డిటైల్స్
Maruti Suzuki | దేశీయ మార్కెట్లోకి మంగళవారం మారుతి సుజుకి ఎస్-సీఎన్జీ బాలెనో, ఎక్స్ఎల్-6 వేరియంట్లను తీసుకొచ్చింది.
Maruti Suzuki | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి ఎస్-సీఎన్జీ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తోంది. అందులో భాగంగా మంగళవారం ఎక్స్ఎల్-6 ఎస్-సీఎన్జీ, బాలెనో సీఎన్జీ మోడల్ కార్లను ప్రవేశ పెట్టింది. బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రెండో వేరియంట్లలో, ఎక్స్ఎల్- 6 ప్రీమియం ఎంవీపీ లభ్యం కానున్నాయి. బాలెనో ఎస్-సీఎన్జీ డెల్టా మాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఎంటీ) రూ.8.28 లక్షలు, జెటా (ఎంటీ) రూ.9.21 లక్షలకు లభ్యం అవుతాయి. ఎక్స్ ఎల్ -6 ఎస్-సీఎన్జీ వేరియంట్ జెటా (ఎంటీ) రూ.12.24 లక్షలకు కొనుక్కోవచ్చు.

న్యూ ఏజ్ బాలెనో లీడింగ్ క్లాస్ టెక్నాలజీ, సేఫ్టీ, కంఫర్ట్‌తోపాటు సౌకర్యవంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నది. బాలెనో హ్యాచ్ బ్యాక్ 30.61 కిలోమీటర్ ఫర్ కేజీ సీఎన్జీ మైలేజీ అందిస్తుంది. కస్టమర్ల సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులోకి వస్తుంది. ఇన్-బిల్ట్ కనెక్ట్ విత్ 40+ ఫీచర్లతో లభ్యం అవుతుంది. 17.78సీఎం స్మార్ట్ ప్లే ప్రో టచ్- ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ ఫీచర్లకు బాలెనో హ్యాచ్ బ్యాక్ సపోర్ట్‌గా ఉంటుంది. ఎంఐడీ డిస్ప్లే విత్ సీఎన్జీ స్పెసిఫిక్ స్క్రీన్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 60:40 రేర్ స్ప్లిట్ సీట్స్ ఫీచర్లు ఉన్నాయి. పెట్రోల్ మోడ్‌లో 1.2- లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్ గరిష్టంగా 90 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం పీక్ టార్చ్ వెలువరిస్తుంది. సీఎన్జీ మోడ్‌లో గరిష్టంగా 77పీఎస్ విద్యుత్, 98.5 ఎన్ ఎం పీక్ టార్చి వెలువరిస్తుంది. న్యూ సీఎన్జీ ఆప్షన్స్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడ్‌తో వస్తోంది.

మారుతి సుజుకి ఎక్స్ఎల్-6ప్రీమియం ఎంవీపీ 1.5- లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యతో వస్తుంది. ఇది 5,500 ఆర్పీఎం వద్ద 87బీహెచ్పీ విద్యుత్ అందిస్తున్నది. 4,200ఆర్పీఎం వద్ద 121.5ఎన్ ఎం పీక్ టార్చి వెలువరిస్తుంది. ఎక్స్ ఎల్ -6 కారు 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్‌తో అందుబాటులోకి వస్తున్నది. పెట్రోల్ మోడ్‌లో 6,000 ఆర్పీఎం వద్ద 99బీహెచ్పీ పవర్, 4,400 ఆర్పీఎం వద్ద 136 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. క్వాడ్ ఎయిర్‌బ్యాగ్స్, ఐఎస్వోఎఫ్ఐఎక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్తో వస్తోంది.
హిల్ హోల్డ్‌తో ఈఎస్పీ, ఎల్ఈడీ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, స్ట్రాంగ్ హియర్టెక్ ప్లాట్‌ఫామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- baleno
- maruti suzuki
- S-CNG
- XL-6
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

