మారుతి లాభాలకు ఖర్చుల సెగ
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,466 కోట్ల నికర లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది దే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 26.4 శాతం తగ్గింది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 26 శాతం ఎగబాకి రూ.53,355 కోట్లకు ఎగబాకింది.
- క్యూ2లో 26 శాతం తగ్గిన ప్రాఫిట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,466 కోట్ల నికర లాభాన్ని మాత్రమే ఆర్జించింది. క్రితం ఏడాది దే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 26.4 శాతం తగ్గింది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం మాత్రం ఏడాది ప్రాతిపదికన 26 శాతం ఎగబాకి రూ.53,355 కోట్లకు ఎగబాకింది. నిర్వహణ ఖర్చులు పెరుగడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ ఎండీ, సీఈవో హిసాచీ తకేచి తెలిపారు.
ప్రధానంగా కమోడిటీ ఉత్పత్తులు ప్రియంకావడం, ఫారెక్స్ తీవ్ర ఆటుపోటులకు నమోదు కావడం, వీటితోపాటు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై రాబడి తగ్గుముఖం పట్టడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. నిర్వహణ ఖర్చులు 29.7 శాతం ఎగబాకి రూ.50,619 కోట్లకు చేరుకున్నాయి. గత త్రైమాసికంలో సంస్థ 6.96 లక్షల కార్లను విక్రయించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమన్నాయని, దీంతో సంస్థ అదనపు ఆర్థిక భారం మోయాల్సి వచ్చిందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

