Maruti Suzuki Jimny | 5న దేశీయ మార్కెట్లోకి మారుతి జిమ్నీ
Maruti Suzuki Jimny | ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి జిమ్నీ కారు ఈ నెల ఐదో తేదీన మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే ఈ కారు కోసం 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.
Maruti Suzuki Jimny | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి మరో ఎస్యూవీ కారు ‘జిమ్నీ (Maruti Suzuki Jimny) మార్కెట్లోకి వచ్చే ముహూర్తం ఖరారైంది. ఈ నెల ఐదో తేదీన జిమ్నీ మార్కెట్లోకి రానున్నది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఎస్యూవీ పోర్ట్ ఫోలియో కార్లు ఫ్రాంక్స్, బ్రెజా, గ్రాంట్ విటారాతో జత కలవనున్నది. మారుతి జిమ్నీ కారు ధర కూడా ఈ నెల ఐదో తేదీనే వెల్లడిస్తామని సంస్థ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
జనవరి 12 నుంచే మారుతి జిమ్నీ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 30 వేలకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్యూవీ కార్ల మార్కెట్లో 25 శాతం అంటే 4.75 లక్షల యూనిట్లు విక్రయించాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకున్నది.
మారుతి జిమ్నీ టాప్ టూ ట్రిమ్స్ జెటా, ఆల్ఫా వేరియంట్లుగా వస్తున్నది. వీటి ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండొచ్చునని అంచనా. కే15బీ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 105 పీఎస్ విద్యుత్, 134 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభ్యం అవుతాయి. లాడర్ ఫ్రేమ్ చేసిస్ ఆధారంగా ఈ ఎస్యూవీ కారు ఆల్ గ్రిప్ పీఆర్వో 4డబ్ల్యూడీ టెక్నాలజీ విత్ లో రేంజ్ ట్రాన్స్ ఫర్ గేర్ (4ఎల్ మోడ్) స్టాండర్డ్‌తో వస్తున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రాలో పాపులర్ ఎస్యూవీ మోడల్ కారు థార్, ఫోర్స్ గుర్ఖా వంటి కార్లతో పోటీ పడున్నది. మారుతి సుజుకి జిమ్నీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ వాషర్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ లాంప్స్, ఎలక్ట్రికల్టీ అడ్జస్టబుల్ అండ్ రీట్రాక్టబుల్ ఓఆర్వీఎంస్, 15- అంగుళాల అల్లాయ్ వీల్స్, హార్డ్ టాప్, డ్రిప్ రెయిల్స్, క్లాంప్ షెల్ బానెట్, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ ఫీచర్లు కలిగి ఉంటుంది.
క్యాబిన్ లోపల 9- అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ హెచ్డీ డిస్ ప్లే, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఆర్కామీస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఆప్షన్లు ఉంటాయి. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, రేర్ వ్యూ కెమెరా, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల సంయుక్త తనిఖీలు
Chilling video | మహారాష్ట్రలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Jamia Millia Islamia | ఎన్నికల కోసం జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు నిరసన.. భద్రతా సిబ్బందితో ఘర్షణ
రుద్ర వాణి గాయత్రికి ఎంజీయూ డాక్టరేట్
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

