Maruti Jimny | ఎస్యూవీ కార్లపైనే ఇండియన్స్ క్రేజ్.. మారుతి జిమ్నీ కోసం ప్రీ బుకింగ్స్ ఎన్నంటే?!
Maruti Jimny | ఎస్యూవీ కార్లపై భారతీయులు క్రేజీ పెంచుకుంటున్నారు. మారుతి త్వరలో మార్కెట్లోకి తేనున్న జిమ్నీ కోసం 24,500 ప్రీ-బుకింగ్స్ రిజిస్టర్ కావడమే దీనికి నిదర్శనం.
Maruti Jimny | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అందునా చాలా విశాలంగా.. కుటుంబ సభ్యులంతా హాయిగా కూర్చునేందుకు వెసులుబాటు గల ఎస్యూవీ కార్ల కొనుగోలుకు మొగ్గుతున్నారు. ఇప్పుడు ప్రతి నెల కార్ల విక్రయాల్లో దాదాపు సగం ఎస్‌యూవీలే.. అంటే ప్రతి రెండు కార్లలో ఒక ఎస్యూవీ కారు అమ్ముడవుతున్నది.
ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న సబ్-4 కంపాక్ట్ ఎస్యూవీ జిమ్నీ పట్ల ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నాలుగు డోర్ల జిమ్నీ ఎస్యూవీ కోసం ఇప్పటికే 24,500 బుకింగ్స్ నమోదైనట్లు తెలుస్తున్నది. దీంతో భారతీయులు మారుతి జిమ్నీ ఎస్యూవీ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న విషయం అవగతం అవుతుంది.
మారుతి సుజుకి ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లోకి తెచ్చిన ఎస్యూవీ కార్లలో ఇది నాల్గవది. బ్రెజా, గ్రాండ్ విటారా ఎస్యూవీ కార్లు ఇప్పటికే మార్కెట్లో చాలా పాపులర్ కార్లు. తాజాగా ఫ్రాంక్స్ ఎస్యూవీ ఇటీవలే ఆవిష్కరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ ఎస్‌యూఈ కార్ల మార్కెట్లో నాలుగో వంతు వాటా దక్కించుకునే వ్యూహంతో ముందుకు సాగుతోంది మారుతి సుజుకి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బ్రెజా, గ్రాండ్ విటారాతోపాటు కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఫ్రాంక్స్, వస్తున్న జిమ్నీలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది.
గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు 16.73 లక్షల ఎస్యూవీ కార్లు విక్రయించాయి. అందులో మారుతి సుజుకి వాటా 2.02 లక్షలే. మొత్తం ఎస్యూవీ కార్ల సేల్స్‌లో మారుతి వాటా 12.07 శాతం. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో-2023లో మారుతి సుజుకి.. జిమ్నీ, ఫాంక్స్లను ఆవిష్కరించింది.
మారుతి సుజుకి జిమ్నీ ఈ నెలాఖరులో గానీ, వచ్చేనెల ప్రారంభంలో గానీ మార్కెట్లోకి రానున్నది. దీని ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. జిమ్నీ కారు కే15బీ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 105 పీఎస్‌ల విద్యుత్, 134 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యం అవుతుందని తెలుస్తుంది. జిమ్నీ కారు ఆల్‌గ్రిప్ ప్రో 4డబ్ల్యూడీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్నది. దేశీయ మార్కెట్లోకి జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

