Maruti Fronx | ఆ కారు నాన్ టర్బోపైనే కస్టమర్ల మోజు.. ఎందుకో తెలుసా?!
Maruti Fronx | ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్ నాన్ టర్బో వర్షన్ కార్లకే యూజర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం 15 శాతం మంది టర్బో వర్షన్ కారు బుక్ చేసుకుంటున్నారు.
Maruti Fronx | మారుతి సుజుకి కార్లంటే మోజు. ఈ ఏడాది జనవరి 12న ఆటో ఎక్స్ పోలో జిమ్నీతోపాటు ఫ్రాంక్స్ మోడల్ కారును ప్రదర్శించి మారుతి సుజుకి. అదే రోజు జిమ్నీ, ఫ్రాంక్స్ మోడల్ కార్ల బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కానీ, ఫ్రాంక్స్ కారు బుక్ చేసుకున్న వారిలో మెజారిటీ నాన్-టర్బో మోడల్ వైపే మొగ్గు చూపుతున్నారు. ధరలు ప్రకటించిన తర్వాత ధోరణిలో మార్పు వచ్చిందని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
85 శాతం బుకింగ్స్ నానో టర్బో వేరియంట్ కారుకు నమోదైతే, టర్బో వేరియంట్ కేవలం 15 శాతం కస్టమర్లు మాత్రమే ఎంచుకుంటున్నారని శశాంక్ శ్రీవాత్సవ అన్నారు.. ధరలు ప్రకటించక ముందు టర్బో వర్షన్ కారు కోసం 55 శాతం బుకింగ్స్ నమోదయ్యాయని తెలిపారు. ఏప్రిల్ నెలలో ఫ్రాంక్స్ దేశీయంగా 8,784 యూనిట్లు విక్రయిస్తే, మే నెలలో 10 వేలకు చేరువలో ఉందన్నారు. ఫ్రాంక్స్ ఎస్ యూవీ -సిగ్మా, డెల్టా, డెల్టా +, జెటా, ఆల్ఫా వేరియంట్లలో లభిస్తున్నాయి.
గత ఏప్రిల్ 24న ఫ్రాంక్స్ రూ.7.46 లక్షల నుంచి రూ.13.13 లక్షల మధ్య ధరతో మార్కెట్లోకి వచ్చేసింది. ఈ నెల ఏడో తేదీన జిమ్నీ మార్కెట్లోకి ఎంటరవుతుంది. 5-డోర్ ఆఫ్ రోడర్ జిమ్నీ కారు ధర రూ.11-15 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫ్రాంక్స్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.0- లీటర్ల టర్బో బూస్టర్ జెట్ పెట్రోల్ (100.06పీఎస్ విద్యుత్, 147.6 ఎన్ఎం టార్చి), 1.2 లీటర్ల డ్యుయల్ జెట్ డ్యుయల్ వీవీటీ పెట్రోల్ (89.73 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్చ్) ఆప్షన్ వేరియంట్లలో లభిస్తున్నది. ఇక టర్బో యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఇక నాన్ -టర్బో యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5-స్పీడ్ ఏఎంటీ చాయిస్ ల్లో లభిస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరలు ఇలా
సిగ్మా 1.2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.7.46 లక్షలు
డెల్టా 1.2 మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.8.32 లక్షలు
డెల్టా 1.2 ఏఎంటీ – రూ.8.87 లక్షలు
డెల్టా + మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.8.72 లక్షలు.
డెల్టా + 1.2 ఏఎంటీ – రూ.9.27 లక్షలు
డెల్టా + మాన్యువల్ ట్రాన్స్మిషన్- రూ.9.72 లక్షలు
జెటా 1.0 మాన్యువల్ ట్రాన్స్మిషన్- రూ.10.05 లక్షలు
జెటా 1.0 ఏటీ – రూ.12.05 లక్షలు
అల్ఫా 1.0మాన్యువల్ ట్రాన్స్మిషన్- రూ.11.47 లక్షలు
అల్ఫా 1.0 ఏటీ- రూ.12.98 లక్షలు
అల్ఫా 1.0 మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్యుయల్ టోన్ – రూ.11.63 లక్షలు
అల్ఫా 1.0 ఏటీ డ్యుయల్ టోన్ – రూ.13.13 లక్షలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

